Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ ఎఫెక్ట్: ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య
By: Tupaki Desk | 19 May 2020 12:15 PM ISTతమిళనాడులో దారుణం జరిగింది. లాక్ డౌన్ లో ఉద్యోగం కోల్పోయి.. వేరే జాబ్ దొరకకపోవడంతో 37 ఏళ్ల నిరుద్యోగి తన ముగ్గురు పిల్లలను చంపి.. చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషాదం నింపింది. తమిళనాడులోని శ్రీపెరంబుదూరు సమీపంలోని ఓ గ్రామంలో ఈ దారుణం జరిగింది.
అర్ముగం (37) అనే వ్యక్తి లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం సంపాదించ లేకపోయాడు. ఆయన భార్య గోమతి అమ్మాల్ హౌస్ కీపింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే లాక్ డౌన్ కారణంగా 50రోజులుగా ఆమె ఇంట్లోనే ఉంటోంది. ఉద్యోగం లేకపోవడంతో జీతం రాలేదు. సోమవారం నుంచి ఆమె ఉద్యోగానికి వెళ్లింది.
తనకు ఉద్యోగం లేకపోవడం.. భార్యకు సంపాదన రాకపోవడంతో పని సంపాదించాలని భార్య ఒత్తిడి తెచ్చింది. దీంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆర్థిక కష్టాలు భరించలేక మనస్థాపం చెందిన నిరుద్యోగి అర్ముగం తన కూతుళ్లు రాజేశ్వరి (12), శాలిని (10), కుమారుడు సేతురామన్ (8)లను హత్య చేశాడు. రాజేశ్వరిని గొంతు నులిమి చంపేయగా.. మిగతా ఇద్దరు పిల్లలను నీళ్లలో ముంచి చంపాడు.
గోమతి సాయంత్రం 5 గంటలకు ఇంటికి తిరిగి రాగా పెద్ద కూతురు రాజేశ్వరి రక్తపు మడుగులో పడి ఉంది. ఇద్దరు పిల్లలు, భర్త కోసం వెతికారు. ఇంటికి కొద్దిదూరంలో ఓ పొలంలో ఆర్ముగం శవం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. సమీపంలోని బావిలో ఇద్దరి పిల్లల శవాలున్నాయి.
ఇలా లాక్ డౌన్ కారణంగా ఇన్నిరోజులకు తొలిసారి విపరిణామాలు చోటుచేసుకున్నాయి. సంపాదన లేక ముగ్గురి ప్రాణాలు పోయాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ రెండు నెలల తర్వాత మొదలైందనే చెప్పాలి. ఆదాయం లేక ఇంకా ఎన్ని అనర్థాలు జరుగుతాయో తలుచుకుంటేనే భయంగా ఉంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రజలకు నేరుగా సాయం చేయకపోతే మరిన్ని దారుణాలు వెలుగుచూసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.