Begin typing your search above and press return to search.

దేశంలోని ఆ 150 జిల్లాల్లో లాక్ డౌన్ .. ఎందుకంటే !

By:  Tupaki Desk   |   29 April 2021 1:30 AM GMT
దేశంలోని ఆ 150 జిల్లాల్లో లాక్ డౌన్ .. ఎందుకంటే !
X
దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి జోరు బీభత్సంగా కొనసాగుతుంది. రోజుకి మూడున్నర లక్షల పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. . దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో 15శాతం పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో లాక్ డౌన్ విధించాలనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ 150 జిల్లాలో పాజిటివిటీ రేటు ఆధారంగా లాక్ డౌన్ విధించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ జిల్లాల్లో అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్నీ సర్వీసులు నిలిచిపోనున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది.

అయితే , ఆ జిల్లాల్లో పటిష్టమైన లాక్ డౌన్ అమలు చేయాలి అంటే ..రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది. దేశంలో పలు జిల్లాలో అత్యధిక స్థాయిలో పెరిగిపోతున్న పాజిటివ్ కేసుల దృష్ట్యా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వచ్చే కొన్ని వారాల్లో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు జిల్లాల్లో లాక్ డౌన్ వంటి కఠినమైన చర్యలు చేపట్టాలని విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిన్న దేశంలో మూడు లక్షల అరవై వేల కి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర , యూపీ , కర్ణాటక , కేరళలో కొత్త కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. భారత్ రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 20శాతంగా నమోదైంది.ఎనిమిది రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక, కేరళ, రాజస్థాన్, గుజరాత్, చత్తీస్ గడ్, తమిళనాడులో యాక్టివ్ కేసులు లక్షకు పైగా నమోదయ్యాయి. మొత్తంగా కరోనా కేసులు 69శాతం మేర పెరిగాయి.

కాగా దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 17,23,912 కరోనా పరీక్షలు చేయగా.. 3,60,960 కేసులు బయటపడ్డాయి. దీనితో మొత్తం కేసులు సంఖ్య 1,79,97,267కి చేరింది. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో 3,293 మంది మృతి చెందారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 2,01,187గా నమోదయ్యాయి. ఇక కరోనా నుంచి ఒక్కరోజులోనే 2,61,162మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 29,78,709 యాక్టివ్ కేసులున్నాయి.