Begin typing your search above and press return to search.
దేశంలో మే 2 నుండి లాక్ డౌన్ ... అసలు విషయం ఇదే !
By: Tupaki Desk | 16 April 2021 10:00 PM IST'కరోనా' తో దేశం మొత్తం ఓ వైపు అల్లాడిపోతుంటే ...దీన్ని కూడా కొందరు క్యాష్ చేసుకొనే పనిలో పడ్డారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ కు మొగ్గుచూపుతున్నాయి. ఈ తరుణంలో కొందరు కరోనా కేసులను క్యాష్ చేసుకుంటున్నాయి బుకీలు. దేశంలో లాక్ డౌన్ వార్తలపై భారీగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. మే 2 తేదీ నుండి లాక్ డౌన్ ఉంటుందంటూ బెట్టింగ్ చేస్తున్నారు బూకీలు. నెల రోజుల పాటు లాక్ డౌన్ ఉంటుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో క్రికెట్ బెట్టింగ్ లాగే, లాక్ డౌన్ పై కూడా బెట్టింగ్ చేస్తున్నారు యూత్. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ బెట్టింగ్ పై నిఘా పెట్టారు పోలీసులు. త్వరలోనే ఆ బుకీలను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ తరహా బెట్టింగ్స్ కి పాల్పడవద్దు అని చెప్తున్నారు.
తెలంగాణాలో లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదన్నారు వైద్య,ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్. కరోనా సెకండ్ వేవ్ మహరాష్ట్రలో వేగంగా వ్యాపిస్తోందని..ఇతర రాష్ట్రాల కరోనా బాధితులు వైద్యం కోసం హైదరాబాద్ కు వస్తున్నారన్నారు. దీని కారణంగా తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ , కర్ఫ్యూ , 144 సెక్షన్ పెట్టె ప్రసక్తే లేదు అని అన్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు తగ్గించుకోవాలని.. అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని చూసించారు. మాస్కులు, శానిటేజర్లు ఉపయోగించాలన్నారు. భౌతిక దూరం పాటించాలని తెలిపారు.రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి ప్రభుత్వం తరుపున అన్నిచర్యలు తీసుకున్నామన్నారు మంత్రి ఈటల.
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల మధ్య 3,840 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం ఒక్కరోజులో కరోనాతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 1,198 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,41,885కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,09,594 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,797గా ఉంది.