Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఎఫెక్ట్ : క్వార్టర్‌ రూ.1000!

By:  Tupaki Desk   |   6 April 2020 12:00 PM IST
లాక్ డౌన్ ఎఫెక్ట్ : క్వార్టర్‌ రూ.1000!
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. మొత్తం 205 దేశాలకు వ్యాప్తిచెందిన కరోనా వైరస్ వేలాది మందిని పొట్టనబెట్టుకుంది. కొన్ని లక్షల మంది ఈ వ్యాధితో పోరాడుతున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షల 70 వేల మందికి పైగా కరోనా భారిన పడ్డారు. అలాగే 69,464 మంది మృతి చెందారు. ఇక మన దేశంలో కూడా కరోనా వైరస్ మహ్మమారి రోజురోజుకి మరింత తీవ్రరూపం దాల్చుతుంది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు దేశంలో 4,289 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇకపోతే, ఈ లాక్ డౌన్ కొందరు అక్రమ మద్యం వ్యాపారులకు స్వర్గధామం అయ్యింది. ఇప్పటి వరకూ ఒక క్వార్టర్‌ సీసాపై రూ.50నుంచి రూ.100 అదనంగా తీసుకుని అమ్మినవారు ఇప్పుడు కళ్లు తిరిగే ధరలకు మద్యం అమ్ముతూ రెండు చేతులా అందిన కాడికి పిండుకుంటున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో అత్యంత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నది మాత్రం మందుబాబులే. సాధారణ రోజుల్లో ప్రతి నిత్యం మందు తాగుతూ మత్తులో తూగే మందుబాబులు ...గత కొన్ని రోజులుగా మద్యం దొరకక పోవడంతో , మందు ఇస్తే చాలు ఎంతైనా ఇస్తాం అని అంటుండటంతో వ్యాపారులకు వరంగా మారింది.

చీప్‌ లిక్కర్‌ క్వార్టర్‌ సగటున రూ.150 ఉంటే - ఇప్పుడు దానిని రూ.700వరకూ అమ్ముతున్నారు. క్వార్టర్‌ రూ.250 విలువచేసే మీడియం బ్రాండ్‌ ను రూ.వెయ్యికి అమ్ముతున్నారు. షాపుల్లో ఫుల్‌ సీసా కొంటే మొత్తం ధరలో కొంత తగ్గుతుంది. కానీ, ఇప్పుడు అలాంటివేమీ ఉండటం లేదు. ఫుల్‌ బాటిల్ కొన్నా కూడా - చెప్పినంత ఇవ్వాల్సిందే. లేకపోతే సీసా ఇవ్వడంలేదు. లాక్‌ డౌన్‌ లో స్థానిక నాయకులు, అధికారుల సహకారంతో ప్రభుత్వ షాపుల నుంచే అనేకచోట్ల మద్యాన్ని బయటకు తెస్తున్నారు. దీనికి సేల్స్‌ మెన్‌ - సూపర్‌ వైజర్లు సహకరిస్తున్నారు. తలా కొంచెం పంచుకునే విధానంలోనే అక్రమ వ్యాపారం జరుగుతోంది. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో ఓ సీఐ ఏకంగా సరుకు తరలిస్తూ దొరికి పోయాడు.