Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఎఫెక్టు.. 70లక్షల మందికి గర్భం

By:  Tupaki Desk   |   30 April 2020 10:15 AM IST
లాక్ డౌన్ ఎఫెక్టు.. 70లక్షల మందికి గర్భం
X
ఒక భారీ పరిణామం చోటు చేసుకున్నప్పుడు.. అందుకు తగ్గట్లు మరిన్ని పరిణామాలు చోటు చేసుకోవటం మామూలే. గడిచిన వందేళ్లలో ఎప్పుడూ లేని రీతిలో కంటికి కనిపించని ఒక సూక్ష్మజీవి కారణంగా యావత్ ప్రపంచం స్తంభించిపోవటం.. ఎవరిళ్లల్లో వారు ఉండిపోవాల్సి రావటం.. వారాల తరబడి సాగుతున్న లాక్ డౌన్.. మరింత కాలం కంటిన్యూ అవుతుందన్న మాట వినిపిస్తున్న వేళ షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

కరోనా కారణంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళల మీద తీవ్ర ప్రభావం పడుతోందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఆసక్తికర సమాచారాన్ని ఐక్యరాజ్య సమితి తాజాగా వెల్లడించింది. రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది మహిళలు.. వారు కోరుకోకుండానే గర్భధారణ జరిగే అవకాశం ఉందని పేర్కొంది.

ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ తాజాగా చేసిన పరిశోధనలో లాక్ డౌన్ వేళ మహిళలు కుటుంబ నియంత్రణ పద్దతులకు దూరం కావటంతో భారీ ఎత్తున గర్భధారణ జరగనుందని తేల్చింది. ఒకవేళ లాక్ డౌన్ మరో ఆర్నెల్లు కానీ కొనసాగితే.. ఇలాంటి అవాంఛిత గర్బాల సంఖ్య ఏకంగా 4.7 కోట్లకు చేరుకునే వీలుందని చెబుతున్నారు. అంతేకాదు.. లాక్ డౌన్ కారణంగా మహిళలు తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లుగా ఈ రిపోర్టు తేల్చింది.

బాలికలపై వేధింపులతో పాటు.. గృహహింస.. హక్కులకు భంగం వాటిల్లే పలు అంశాలు చోటు చేసుకుంటున్నట్లుగా యూఎన్ఎఫ్ పీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాలియా కానెమ్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేలా ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.

లాక్ డౌన్ కారణంగా పలు దేశాల్లోని జంటలు.. అదే పనిగా రొమాన్సులో మునిగి తేలుతున్నారని.. గర్భధారణ నిరోధించే పిల్స్.. కండోమ్ లకు కొరత ఏర్పడ్డాయి. దీంతో.. గర్భనిరోధకాలు లేకుండానే రొమాన్సు చేస్తున్న కారణంగా మహిళలు అవాంఛనీయ గర్భధారణకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.