Begin typing your search above and press return to search.
లాక్‌డౌన్: ఏపీలో పడిపోయిన క్రైం రేట్
By: Tupaki Desk | 7 April 2020 10:00 AM ISTకరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించింది. ప్రస్తుతం విజయవంతం గా స్వీయ నిర్బంధం కొనసాగుతోంది. అయితే ఈ లాక్‌డౌన్ అమలుతో సమాజంలో మంచి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాలుష్యం తగ్గగా.. ప్రస్తుతం వేసవికాలం ఉన్నా అంతగా ఎండలు లేవు. ఈ లాక్ డౌన్ తో ఆంధ్రప్రదేశ్ లో ఆశ్చర్యకర పరిణామాలు చోటచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో నేర చరిత్ర అనూహ్యంగా తగ్గి పోయింది. పలు ప్రాంతాల్లో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గాయి. తాజాగా జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన రిపోర్టును చూస్తే ఆ విషయం తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో క్రైమ్ రేట్ అనూహ్యంగా తగ్గిపోయి కనిష్టానికి చేరుకుంది.
లాక్ డౌన్ అమలుతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవడంతో క్రైమ్ రేట్ భారీగా తగ్గడానికి కారణంగా ఆ రిపోర్టు చెబుతోంది. ఆ రిపోర్టు ప్రకారం సుమారు 33 నుంచి 55 శాతం మేరకు నేరాల సంఖ్య తగ్గిందని పోలీసు అధికార వర్గాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్ అమలుతోపాటు పోలీసుల గస్తీతో పాటు నిరంతర నిఘా ఉండడం.. ఎవరి ఇంటికి వారు పరిమితం కావడంతో నేరాల సంఖ్య తగ్గడానికి కారణమని తెలుస్తోంది. నేరాలు, దొంగతనాలు తగ్గుముఖం పట్టాయి. వీటితో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా బాగా తగ్గాయి. గతంలో రోజు రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు మృతు చెందుతుడడంతో పాటు తీవ్రంగా గాయపడేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే వాహనాల రాకపోకలు నిషేధం విధించారు.
మార్చిలో లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కేవలం 140 రోడ్డు ప్రమాదాలు మాత్రమే నమోదయ్యాయి. కిడ్నాప్ కేసుల సంఖ్య భారీగా పడిపోయింది. హత్య కేసుల సంఖ్య కూడా 1 శాతానికి తగ్గినట్లు ఆ రిపోర్టులు చెబుతున్నాయి. గతంలో చాలావరకు కుటుంబం కలహాలు - దొంగతనాలు - కిడ్నాప్ - హత్య కేసులు భారీగా ఉండేవి. అయితే రెండు వారాల్లో అవి కనిపించడం లేదు. వాటి సంఖ్య గణనీయంగా తగ్గిందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. మహిళలపై దాడులు కూడా తగ్గుముఖం పట్టాయి. రేప్ - లైంగిక దాడులు - సైబర్ క్రైమ్ కేసులు చాలా తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణ లో కూడా నేరాలు 55 శాతం తగ్గాయని జాతీయ క్రైమ్ రికార్డ్స్ నివేదిక వెల్లడిస్తోంది. రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా భారీగా తగ్గింది.