Begin typing your search above and press return to search.

లాక్‌డౌన్ న‌ష్టమంతా తాగుబోతుల‌పైనే: మ‌ద్యం రేట్లు పెంచుతున్న రాష్ట్రాలు

By:  Tupaki Desk   |   6 May 2020 8:00 PM IST
లాక్‌డౌన్ న‌ష్టమంతా తాగుబోతుల‌పైనే: మ‌ద్యం రేట్లు పెంచుతున్న రాష్ట్రాలు
X
దాదాపు 45 రోజులుగా దేశ‌మంతా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో అన్ని వ్యాపారా కార్య‌క‌లాపాలు, ప్ర‌జ‌ల జ‌న‌జీవ‌న కార్య‌క‌లాపాలు ఆగిపోయాయి. ప్ర‌జ‌లు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. వ్యాపార‌, వాణిజ్య, సినీ, పారిశ్రామిక, ఎక్సైజ్ త‌దిత‌ర రంగాల‌న్నీ మూసి ఉన్న విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌భుత్వానికి రావాల్సిన ఆదాయం రావ‌డం లేదు. వంద‌ల కోట్లు రావాల్సిన ఆదాయం ‌సింగిల్ డిజిట్‌కు ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే. రాష్ట్రాల‌కు వ‌చ్చే ఆదాయాన్ని తొలిసారిగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు బ‌య‌ట‌పెట్టారు. కేసీఆర్ వివ‌ర‌ణ ఇవ్వ‌డంతో మొద‌టిసారి లాక్‌డౌన్‌తో రాష్ట్రాలు భారీగా ఆర్థికంగా న‌ష్ట‌పోతున్నాయ‌ని తెలిసింది. రాష్ట్రాల‌తో పాటు కేంద్రానికి కూడా ఆదాయం రావ‌డం లేదు. అన్ని రాష్ట్రాలు దివాళా తీసేంత స్థాయికి చేరింది. అయితే కేంద్రం స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో రాష్ట్రాల్లో ఆశ‌లు చిగురించాయి. ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా ఉన్న మ‌ద్యం దుకాణాలు ప్రారంభించారు. అయితే మ‌ద్యం దుకాణాలు ప్రారంభించ‌క‌ముందే మందుబాబుల‌కు భారీ షాక్‌లు ప‌లు రాష్ట్రాలు ఇస్తున్నాయి.

వాస్త‌వంగా సోమ‌వారం నుంచి మ‌ద్యం దుకాణాలు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆలస్యంగా అవుతున్నాయి. అయితే రాష్ట్రాలు మ‌ద్యం ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా భావిస్తున్నాయి. ఇన్నాళ్లు లాక్‌డౌన్‌తో న‌ష్ట‌పోయిన ఆదాయాన్ని మ‌ద్యం ద్వారా రాబ‌ట్టుకోవాల‌ని చూస్తున్నాయి. అందుకే మ‌ద్యం ధ‌ర‌లు ఇష్టారీతిన పెంచేసుకుంటూ పోతున్నారు. ఒక రాష్ట్రం చూసి మ‌రో రాష్ట్రం ధ‌ర‌లు రెట్టింపు స్థాయిలో పెంచుకుంటూ పోతున్నాయి. మొద‌ట ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం 25 శాతం పెంచింది. ఒక రోజు త‌ర్వాత 50శాతం పెంచుతూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దీంతో మొత్తం 75 శాతం పెంపు చేరింది. ఆ తెల్లారి తెలంగాణ ప్ర‌భుత్వం 16శాతం పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. దీనిలో చీప్ లిక్క‌ర్‌పై త‌క్కువ‌.. విదేశీ మ‌ద్యం బ్రాండ్‌ల‌కు అధికంగా పెంచుతున్న‌ట్లు సీఎం కె.చంద్ర‌శేఖ‌ర్ రావు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇక అన్ని రాష్ట్రాలు మద్యం ధ‌ర‌ల పెంపుపై దృష్టి సారించాయి. క‌ర్నాట‌క‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నిర్ణ‌యాలు తీసుకున్నాయి.

క్షీణించిన ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు మ‌ద్యం ఒక్క‌టే మార్గంగా భావిస్తున్న‌ట్టు ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. ఏకంగా ఆరు రాష్ట్రాలు మద్యం ధ‌ర‌లు భారీగా పెంచడం చూస్తుంటే అదే వాస్త‌వంగా తెలుస్తోంది. మొన్న‌నే మ‌‌ద్యం విక్ర‌యాలు ప్రారంభమ‌య్యాయి. మందుబాబులు మ‌ద్యం ఇలా తాగారో అలా ధ‌ర‌లు పెంచేశారు. దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాలు పెంచిన ధ‌రలు ఇలా ఉన్నాయి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ 75
పశ్చిమ బెంగాల్ 30 శాతం
ఢిల్లీలో 70 శాతం పెంపు
తెలంగాణ 16 శాతం అదనపు వడ్డింపు
కర్ణాటక విదేశీ మద్యంపై 17 శాతం అదనపు భారం
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బాటిల్‌పై రూ.5 నుంచి 30 వ‌ర‌కు

రాష్ట్రాలు ఈ విధంగా చ‌ర్య‌లు తీసుకుంటే కేంద్ర ప్ర‌భుత్వం ఆదాయం వ‌చ్చే మార్గాల‌పై దృష్టి సారించింది. ఈ క్ర‌మంలో పెట్రో ఉత్పత్తులపై వడ్డింపు మొద‌లుపెట్టింది. వాస్త‌వంగా అంత‌ర్జాతీయంగా అతి త‌క్కువ ధ‌ర‌లు ఉన్నా దేశంలో మాత్రం సుంకాలు పెంచేస్తోంది. పెట్రో ఉత్పత్తులపై ధ‌ర‌ల‌ను దేశంతో పాటు రాష్ట్రాలు కూడా పెంచే ఆలోచ‌న‌లు ఉన్నాయి. ఇక పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెంచే అంశం కూడా ప‌రిగ‌ణ‌న‌లో ఉంది.

ముందే ఆదాయం లేక ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే ఇలా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆదాయం పెంచుకునేందుకు ఇలా ధ‌ర‌లు, సుంకాలు పెంచడాన్ని ప్ర‌జ‌లు త‌ప్పుప‌డుతున్నారు. చివ‌ర‌కు దేశాన్ని కాపాడేవారు మందుబాబులేన‌ని ప్ర‌భుత్వాలు నిరూపిస్తున్న‌ట్లు ట్రోలింగ్ మొద‌లైంది. దీనిపై జోక్స్‌, మీమ్స్‌, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి.