Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ పొడిగింపే.. కానీ.. కేంద్రం ట్విస్ట్!

By:  Tupaki Desk   |   30 May 2020 3:45 AM GMT
లాక్ డౌన్ పొడిగింపే.. కానీ.. కేంద్రం ట్విస్ట్!
X
లాక్ డౌన్ పొడిగింపునకే కేంద్రం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్రాల సీఎంల అభిప్రాయాలను తీసుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ మేరకు ప్రధాని మోడీకి సవివరంగా వివరించారు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో లాక్ డౌన్ పొడిగించాల్సిందేనని సీఎంలలో ఎక్కువ మంది అమిత్ షాకు సూచించినట్లు తెలిసింది.

రేపటితో లాక్ డౌన్ 4.0 ముగియబోతోంది. ఈ నేపథ్యంలోనే మోడీ లాక్ డౌన్ 5.0లో భారీ సడలింపులు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే రాష్ట్రాల మెజార్టీ సీఎంలు మాత్రం లాక్ డౌన్ ను పొడిగించాలని కేంద్రాన్ని కోరారు.

అయితే కేంద్రం ఆలోచన మాత్రం మరోలా ఉంది. దేశంలో ప్రబలుతున్న మహమ్మారి కేసుల్లో 30 పట్టణ ప్రాంతాల నుంచే 80శాతం కేసులు ఉన్నాయని.. వాటి విషయంలోనే కఠినంగా ఉండాలని కేంద్రం యోచిస్తోంది. 70శాతం కేసులు దేశంలో నమోదవుతున్న13 నగరాల్లో మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేసేందుకు కేంద్రం మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, థానే, ఫుణే, హైదరాబాద్, కోల్ కతా, మరియు దాని పక్కనే ఉన్న హౌరా, ఇండోర్, జైపూర్ , జోద్ పూర్, చెంగల్పట్టు , తిరువల్లూరు. ఈ నగరాల్లో దేశంలోనే మూడు నగరాలు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. ఈ నగరాల్లో కేంద్రం కఠినమైన చర్యల దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మిగతా లాక్ డౌన్ లేని ప్రాంతాల్లో భారీ సడలింపులు దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం.

దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల్లో 80శాతం నమోదవుతున్న 30 మున్సిపల్ కార్పొరేషన్లతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసిందని.. ఈసారి అక్కడ మాత్రమే గట్టిగా లాక్ డౌన్ విధించి దేశమంతా భారీ సడలింపులు ఇస్తుందని సమాచారం.

ప్రధానంగా ఈ లాక్డౌన్ 5.0లో దేవాలయాలు, మసీదులు, చర్చీలు తెరుచుకునేందుకు అనుమతించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రార్థనా స్థలాల్లో భారీగా ప్రజలు గుమిగూడడం నిషేధిస్తూ నిబంధనలు పాటించేలా అనుమతించేందుకు కేంద్రం మొగ్గుచూపే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రార్థనా స్థలాలకు జూన్ 1 నుంచి అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇక లాక్డౌన్ 5.0లో జిమ్ లకు కూడా అనుమతించేందుకు కేంద్రం రెడీ అవుతోంది. అయితే కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని చోట్ల జిమ్ లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ప్రతీ ఒక్కరు మాస్క్ , భౌతిక దూరంతో ఇవన్నీ నడవనున్నాయి.