Begin typing your search above and press return to search.

దేశంలో కరోనా జోరు : ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ ...హైకోర్టు కీలక వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   28 April 2021 10:49 AM GMT
దేశంలో కరోనా జోరు : ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ ...హైకోర్టు కీలక వ్యాఖ్యలు !
X
దేశంలో కరోనా మహమ్మారి జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకి పెరుగుతూనే పోతుంది తప్ప , తగ్గుముఖం పట్టడంలేదు. ప్రతి రోజు కూడా లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. మొదటి వేవ్ లో రెండు లక్షల పాజిటివ్ కేసులు వస్తే రోజుకి , ప్రస్తుతం మూడున్నర లక్షలకి పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే వేలమంది ప్రతి రోజు కరోనా కాటుకి బలైపోతున్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో దాదాపుగా ఇదే పరిస్థితి. ఆస్పత్రులన్నీ ఫుల్ , బెడ్స్ లేవు , ఆక్సిజన్ కొరత. దీనితో పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ ను వేసేశాయి. అయితే, యూపీలో కరోనా కంట్రోల్ లో ఉందని, వైద్యులు, ఆక్సిజన్, బెడ్స్ కొరత లేదని ఆ రాష్ట్రం ప్రకటించింది. కానీ, ఈ విషయాలను అలహాబాద్ హైకోర్టు ధృవీకరించలేదు. పేపర్ పై అంతా బాగుందని, కానీ, చాలా అంశాల్లో కొరత స్పష్టంగా కనిపిస్తోందని, ఈ దశలో రెండు వారాలపాటు లాక్ డౌన్ విధించడం ఒక్కటే మార్గమని యూపీ ప్రభుత్వానికి సూచించింది.

రెండు వారాలపాటు లాక్ డౌన్ విధించడం వలన కొంతమేర కరోనా కేసులను కట్టడి చెయ్యొచ్చని అలహాబాద్ హైకోర్టు పేర్కొన్నది. అయితే, లాక్ డౌన్ అంశంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఉత్తర్ ప్రదేశ్‌లోని ఐదు నగరాల్లో లాక్‌డౌన్ విధించాలంటూ అలహాబాద్ హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. హైకోర్టు ఆదేశాలపై యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో స్టే విధించింది. లాక్‌డౌన్ అవసరం లేదని, పేదల జీవనోపాధిని దెబ్బతీస్తుందని వాదించారు. కరోనా కట్టడికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నామని సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఇదిలా ఉండగా, బహిరంగ కార్యక్రమాలు, మత వేడుకలను నిషేధించి, విద్యా సంస్థలు, మాల్స్, దుకాణాలను మూసివేయాలని హైకోర్టు సూచించింది. అయితే తాజాగా హైకోర్టు మరోసారి రెండు వారాల లాక్ డౌన్ అవసరం అని వ్యాఖ్యలు చేయడంతో ప్రభుత్వం ఏ విదంగా స్పందిస్తుందో .

ఇకపోతే, కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అలాగే లాక్ డౌన్ కూడా కొనసాగుతుంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక బీహార్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 38 జిల్లాలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈరోజు కూడా అయన అధికారులతో సమీక్ష నిర్వహించి, సమీక్ష అనంతరం లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. కరోనా కట్టడి విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని, ప్రజలు మాస్క్ పెట్టుకునేలా, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశాలు ఇచ్చారు.