Begin typing your search above and press return to search.

దారుణం : సైనికుడి తల్లి అంత్యక్రియలని అడ్డుకున్న స్థానికులు..!

By:  Tupaki Desk   |   9 July 2020 6:15 AM GMT
దారుణం : సైనికుడి తల్లి అంత్యక్రియలని అడ్డుకున్న స్థానికులు..!
X
జై జవాన్ ..జై కిసాన్ అని మనం చాలా సందర్భాల్లో చెప్తుంటాం. మనం మన ఇంట్లో హాయిగా నిద్రపోతున్నాం అంటే దానికి కారణం మన సైనికులే. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలని సైతం వారు అర్పిస్తున్నారు. కానీ , వారు సమాజంలో ఎలాంటి ప్రత్యేక గుర్తింపుని కోరుకోవడం లేదు. కానీ , కొందరు వారి పట్ల కూడా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. దేశం కష్టాలు తీర్చే సైనికుడికే ఇప్పుడు కష్టాలు ఏర్పడ్డాయి. తన తల్లి అనారోగ్యంతో చనిపోతే కరోనా అని భయపడి అక్కడి స్థానికులు ఆమె అంత్యక్రియలకు అడ్డుకున్నారు. నా తల్లి కరోనా తో మృతి చెందలేదు అని , అనారోగ్యంతోనే మరణించింది అని వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్ చూపించి , కాళ్ల మీద పడి ప్రాధేయపడినా కూడా అక్కడ అంత్యక్రియలు నిర్వహించడానికి వారు ఒప్పుకోలేదు. పోలీసులు, రెవెన్యూ, వైద్యశాఖ అధికారులు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేదు. ఈ దుర్ఘటన బెంగుళూరులో జరిగింది.

జార్ఖండ్ కు చెందిన సుమిత్ కుమార్ నెహగల్ అనే యువకుడు కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని కారవార లోని Navy లోని సీబర్డ్ లో సైనికుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగరీత్యా కారవారలో నివాసం ఉంటున్న సుమిత్ కుమార్ నెహగల్ అప్పుడప్పుడు జార్ఖండ్ కు వెళ్లి కుటుంబ సభ్యులను చూసి వస్తున్నాడు. ఐతే , అతని తల్లి నెహగల్ కొద్దీ రోజులుగా కిడ్నీ వ్యాధితో భాదపడుతుండటంతో ఇటీవల జార్ఖండ్ లోని తల్లిని కారవార పిలుచుకుని వెళ్లిన సుమిత్ కుమార్ నెహగల్ ఆమెను కారవారలోని సైనిక స్థావరంలోని పతాంజలి ఆసుపత్రిలో చేర్పించారు. కొన్ని రోజులుగా పతాంజలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుమిత్ కుమార్ నెహగల్ తల్లి మరణించారు.

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా జార్ఖండ్ లోని సొంత ఊరికి తల్లి మృతదేహాన్ని జార్ఖండ్ కు తీసుకెళ్లడానికి కుదరకపోవడంతో కారవారలో అంత్యక్రియలు నిర్వహించాలని సుమిత్ కుమార్ నెహగల్ నిర్ణయించాడు. తల్లి అంత్యక్రియలు కారవారలోని చెండియా గ్రామ పంచాయితీ పరిధిలోని స్మశాసనవాటికలో నిర్వహించడానికి అధికారుల దగ్గర నుంచి సుమిత్ కుమార్ నెహగల్ అనుమతి తీసుకున్నారు. తీరా స్మశానవాటికలోకి వెళ్లిన సుమిత్ కుమార్ నెహగల్ తల్లి అంత్యక్రియలకు అన్ని సిద్దం చేసుకుంటున్న సమయంలో స్థానికులు అడ్డుకున్నారు. తన తల్లి కిడ్నీ వ్యాధితో మరణించారని, ఆమెకు కరోనా వైరస్ సోకలేదని, వైద్యులు సర్టిఫికెట్ కూడా చూపించాడు. అయితే తమకు కరోనా వైరస్ వ్యాపిస్తోందని భయంగా ఉందని ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించడానికి అవకాశం ఇవ్వమని స్థానికులు తేల్చిచెప్పారు. స్థానిక అధికారులు , పోలీసులు చెప్పినా వినలేదు. చివరికి జనశక్తి సంస్థ అధ్యక్షుడు మాధవనాయక్ ముందుకు వచ్చి కారవారలోని సర్వోదయనగర్ లోని స్మశాన వాటిలో సైనికుడు సుమిత్ కుమార్ నెహగల్ తల్లి అంత్యక్రియలు పూర్తి చేయించారు.