Begin typing your search above and press return to search.
వైజాగ్ లో రాజుకుంటున్న లోకల్-నాన్ లోకల్ మూమెంట ?
By: Tupaki Desk | 12 Dec 2020 10:00 PM ISTవిశాఖపట్నం నగరంలో లోకల్, నాన్ లోకల్ మూమెంట్ రాజుకుంటోందా ? రాజకీయపార్టీలు, స్ధానికులు అవుననే అంటున్నారు. ప్రస్తుత వైజాగ్ సిటీపై నాన్ లోకల్ దే పెత్తనమంతా. వ్యాపార, రాజకీయ రంగాల్లో ప్రధానంగా నాన్ లోకల్ దే పెత్తనం సాగుతోంది. ఏదో జిల్లా నుండి విశాఖ వచ్చేయటం స్ధిరపడిపోయిన తర్వాత మెల్లిగా పెత్తనం చెలాయిస్తున్న వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతోంది. దశాబ్దాలుగా స్ధానికులపై స్ధానికేతరులదే పెత్తనం సాగుతున్నా ఎక్కడా వ్యతిరేకత కనబడలేదు.
అయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల తర్వాత మాత్రం లోకల్-నాన్ లోకల్ అనే తేడా కొట్టొచ్చినట్లు కనబడుతోందని సమాచారం. ఉద్దరాంధ్ర మొత్తం మీద వైజాగ్ ఒక్కటే మెట్రోపాలిటన్ సిటీ. అందుకే ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే వైజాగ్ అభివృద్ధి మాత్రమే అన్నట్లుగా దశాబ్దాలుగా పాలకులు ఫిక్సయిపోయారు. అలాగే వైజాగ్ డెవలప్ అయితే చాలు యావత్ ఉత్తరాంధ్ర అంతా డెవలప్ అయినట్లే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కు వైజాగ్ డెవలప్మెంట్ కు తేడా తెలీకుండానే పాలకులంతా మొత్తం అభివృద్ధిని ఒక్క వైజాగ్ మీద మాత్రమే దృష్టి పెట్టారు. దీని ఫలితంగా అభివృద్ధి పేరుతో నాన్ లోకల్ జనాలు కూడా వైజాగ్ సిటిలోకి వచ్చేశారు. ఎప్పుడైతే ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు తమ కళ్ళముందే సిటీలో స్ధిరపడి ఆర్ధిక, రాజకీయరంగాల్లో బలపడిపోయారో లోకల్ జనాలు వెనకబడిపోయారు. అయితే దశాబ్దాలుగా ఈ విషయాన్ని లోకల్ జనాలు పెద్దగా పట్టించుకోలేదు. వైజాగ్ లో ఉండటానికి ఆంధ్రా యూనివర్సిటి లాంటి పెద్ద పెద్ద విద్యాసంస్ధలున్నా స్ధానికుల ప్రభావం మాత్రం తక్కువనే చెప్పాలి.
స్ధానికుల ఉదాసీనత కారణంగానే ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు హోటళ్ళ వ్యాపారం, పరిశ్రమలు, మద్యం, ఫార్మా ఇండస్ట్రీ, ఆటోమొబైల్ డీలర్ షిప్పులు, విద్యాసంస్దలు, టూరిజం లాంటి అనేక రంగాల్లో పాతుకుపోయారు. ముందు ఆర్ధికంగాను తర్వాత రాజకీయంగా బలపడిపోయారు. ఇన్ని సంవత్సరాలు ఇటువంటి విషయాలను పట్టించుకోని స్ధానికుల్లో ఇప్పుడిప్పుడే నాన్ లోకల్ పై వ్యతిరేకత మొదలైందని సమాచారం. మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత వైజాగ్ సిటీపై బయట ప్రాంతాల వారి తాకిడి ఒక్కసారిగా పెరిగిపోయిందట. దాంతో లోకల్ జనాలో బాగా సఫొకేషన్ పెరిగిపోతోందట.
ఇదే విషయమై కొందరు స్ధానికులు ఓ సమావేశం కూడా పెట్టుకున్నట్లు సమాచారం. ఎప్పుడైతే స్ధానికుల్లో లోకల్, నాన్ లోకల్ అంశపై స్ధానికులు సమావేశమైన విషయం బయటపడిందో వెంటనే రాజకీయపార్టీలు ఆరా తీశాయట. రహస్య సమావేశాన్ని నిర్వహించిందెవరు, సమావేశం ఎవరి ప్రోద్బలంతో జరిగింది, ఎవరెవరు సమావేశంలో పాల్గొన్నారనే విషయంపై తొందరలోనే వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. మొత్తం మీద లోకల్-నాన్ లోకల్ అనే ఫీలింగ్ మాత్రం మొదలైందన్నది వాస్తవం.