Begin typing your search above and press return to search.

బల్లులు ఇలా లిప్ కిస్..రొమాన్స్ చేసుకుంటాయా?

By:  Tupaki Desk   |   7 April 2020 7:12 PM IST
బల్లులు ఇలా లిప్ కిస్..రొమాన్స్ చేసుకుంటాయా?
X
ఇది కరోనా రాగం.. లాక్ డౌన్ తాళం. అందరూ ఎవరింట్లో వారు కూర్చున్నారు. సాధారణమైన పరిస్థితుల్లో ఎవరినైనా పలకరిస్తే చాలు. 'బిజీ' అంటూ నిజమో అబద్ధమో తెలియని ఒక స్టేట్మెంట్ ఇస్తూ పక్కనోళ్లను ఎర్రిపప్పలను చేసేవారు. అయితే ఇప్పుడు అలా కుదరదు కదా. వర్క్ ఫ్రమ్ చేసే బ్యాచ్ చాలా తక్కువే కాబట్టి మిగతావారికి పెద్దగా చేసేందుకు ఏమీ మిగలలేదు. టీవీ చూడడమో లేదా ఫోన్ తో టైం పాస్ చెయ్యడమో.. లేదా అందరికీ ఫోన్లు చేస్తూ.. వచ్చిన ఫోన్ కాల్స్ మాట్లాడుతూ సమయం గడుపుతున్నారు. కొందరైతే ఇంట్లోనే కూర్చుని కూర్చుని చిరాకు తో ప్రకృతిని పరిశీలించడం ఓ అలవాటుగా మార్చుకున్నారు.

సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడు? ఎప్పుడు అస్తమిస్తున్నాడు? ఫ్యాన్ స్విచ్ ఆపిన తర్వాత ఎన్ని సెకన్లు తిరుగుతూ ఉంటుంది? పాలు స్టవ్ మీద కాస్తే ఎంత సేపట్లో మరుగుతాయి? సిమ్ లో అయితే ఎంత సేపు.. హై లో అయితే ఎంత సేపు? ఇలాంటి డేటా కలెక్ట్ చేస్తున్నారు. అంతే కాదు.. కొందరు మేథావులు ఇంట్లో ఉన్న బల్లులు ఏం చేస్తున్నాయి. అవి రొమాన్స్ ఎలా చేసుకుంటున్నాయి? వాటికి మన అర్జున్ రెడ్డి తరహా ఇంటెన్స్ లిప్ లాకులు ఉన్నాయా? లేదా ఏకంగా రంగంలోకి దిగిపోవడమేనా? లాంటి అద్భుతమైన విషయాలపై రీసెర్చ్ చెయ్యడం మొదలు పెట్టారు.

ఇప్పటికే అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ వీడియో అలాంటిదే. మేము బల్లుల రొమాన్స్.. గుడ్లగూబల రొమాన్స్ చూడము అనే వారు ఎంచక్కా కరోనా కౌంట్లు చూస్తూ కాలం గడిపెయ్యవచ్చు. మీరు మీరు చూడండి.. చూడకపోండి కానీ ఇలాంటి వీడియోలు తీసేవారు.. చూసేవారు ఉన్నారని మాత్రం గుర్తించండి!