Begin typing your search above and press return to search.
లైవ్:పార్టీ గెలిచి మమత ఓడిపోతుందా?
By: Tupaki Desk | 2 May 2021 12:02 PM ISTపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ హోరాహోరీ తప్పదు అనుకుంటే.. తాజా ఫలితాల్లో మమత బెనర్జీ పార్టీ విజయం సాధ్యమయ్యేలానే కనిపిస్తోంది. ఇప్పటికే మమత పార్టీ ఆధిక్యంలో మేజిక్ మార్క్ సీట్లను దాటేసింది.
అయితే టీఎంసీ గెలిచి.. నందిగ్రాంలో పోటీచేసిన మమతా బెనర్జీ ఓడిపోయేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీఎం మమత బెనర్జీ గెలుస్తారా? లేదా ఆమెపై పంతం పట్టి బీజేపీ తరుఫున పోటీచేసిన సువేందు అధికారి గెలుస్తారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.
ప్రస్తుతానికి నందిగ్రాంలో మమతా బెనర్జీ వెనుకబడ్డారు. సువేందు అధికారి ఏకంగా మమతపై 8201 ఓట్ల తేడాతో ఆధిక్యంలో ఉన్నారు. దీంతో అక్కడ బీజేపీ గెలిచి.. రాష్ట్రంలో టీఎంసీ గెలిచేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మమతా బెనర్జీ వ్యక్తిగతంగా ఓటమి దిశగా సాగుతున్న ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం బెంగాల్ లో విజయం దిశగా పయనిస్తోంది.
బెంగాల్ లోని మొత్తం 292 స్థానాల్లో ఇప్పటివరకు టీఎంసీ 186 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక టఫ్ ఫైట్ ఇస్తుందనుకున్న బీజేపీ 98 స్థానాల్లో లీడ్ లో ఉంది. టీఎంసీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.