Begin typing your search above and press return to search.

తన సూసైడ్ ను లైవ్ లో పెట్టిన 12 ఏళ్ల అమ్మాయి

By:  Tupaki Desk   |   13 Jan 2017 9:27 AM GMT
తన సూసైడ్ ను లైవ్ లో పెట్టిన 12 ఏళ్ల అమ్మాయి
X
ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ.. 12 ఏళ్ల పాప చేసిన పని ఇప్పుడు పెను సంచలనంగా మారింది. నిండు ప్రాణాల్ని ఆమె విడిచిన వైనం ఇప్పుడు అందరిని కలిచివేస్తోంది. ఇక.. తమ కుమార్తె చేసుకున్న సూసైడ్ తో ఆ కుటుంబ సభ్యుల విషాదం అంతాఇంతా కాదు.

ఉత్తర జార్జియాలోని సెడార్ టౌన్ కు చెందిన కాటెలిన్ నికోల్ డేవిస్ అనే బాలిక సూసైడ్ చేసుకుంది. కళ్లకు కాటుక పెట్టుకొని.. పెదాలకు లిప్ స్టిక్ వేసుకొని అందంగా ముస్తాబై.. జీన్స్.. వైట్ డ్రెస్ తో రెడీఅయిన ఆమె.. తన ఫోన్ లైవ్ వీడియోకు కనెక్ట్ చేసి.. అందరికి హాయ్ చెప్పి మరీ సూసైడ్ చేసుకున్న తీరు అందరిని కలిచివేస్తోంది.

దాదాపు 40 నిమిషాలున్న ఈ వీడియో ప్రపంచాన్ని కుదిపేస్తుంది. తనను క్షమించాలని.. ప్రతిదానికి తాను నిజంగా సారీ చెబుతున్నట్లు చెప్పిన ఆ బాలిక.. ‘‘నేనిది చేయలేను. కానీ.. నేను ఉండలేను’’ అని చెబుతూ చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయింది. దీనికిముందు మరో వీడియోలో తన కుటుంబ సభ్యులు తనను తీవ్రంగా వేధించినట్లుగా పేర్కొంది. వైరల్ గా మారిన ఈ వీడియోను తొలగించేందుకు యూట్యూబ్ ట్రై చేస్తున్నా కావటం లేదని చెబుతున్నారు. ఈ ఉదంతంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/