Begin typing your search above and press return to search.

లైవ్: మండలి రద్దుపై బీఏసీ సమావేశం

By:  Tupaki Desk   |   27 Jan 2020 11:27 AM IST
లైవ్: మండలి రద్దుపై బీఏసీ సమావేశం
X
ఏపీ శాసనమండలి రద్దు కోసం శాసనసభ ఈ ఉదయం సమావేశమైంది.అంతకుముందే సీఎం జగన్ అధ్యక్షతన భేటి అయిన కేబినెట్ సమావేశం ఏపీ శాసనమండలి రద్దుకు తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ఈరోజు శాసనసభలో జగన్ సర్కారు ప్రవేశపెట్టనుంది.

ఈ క్రమంలోనే ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశమైంది. మండలి రద్దు కోసం బిల్లు తనకు అందిందని.. దీనిని శాసనసభలో ప్రవేశపెట్టనున్న దృష్ట్యా చర్చ కోసం బీఏసీ సమావేశం నిర్వహించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం.. సీఎం జగన్ కు సూచించారు. మండలి రద్దు పై చర్చకు ఎంత సమయం కేటాయించాలి? ఎంత సేపు చర్చించాలి.. ఎవరెవరు మాట్లాడాలనే దానిపై బీఏసీలో నిర్ణయించి చెబితే తాను చర్చిస్తానని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు.

దీంతో కాసేపట్లో ఏపీ శాసనసభలో బీఏసీ సమావేశం నిర్వహిస్తున్నారు. మండలి రద్దుపై చర్చ, ఎన్నిరోజులు సభ నడపాలనే దానిపై అధికార, ప్రతిపక్షాలు నిర్ణయిస్తాయి.

బీఏసీ నిర్ణయం ప్రకారం ఏపీ శాసన సభ లో మండలి బిల్లును ప్రవేశపెడుతారు. అనంతరం చర్చించి దీన్ని రద్దు చేస్తూ పార్లమెంట్ కు తీర్మానం పంపుతారు.