Begin typing your search above and press return to search.

ఆ కామాంధుడి సంచలన ఆడియో బయటికి..

By:  Tupaki Desk   |   15 Oct 2017 8:51 AM GMT
ఆ కామాంధుడి సంచలన ఆడియో బయటికి..
X
హార్వే వీన్ స్టీన్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న పేరు. హాలీవుడ్లో పేరుమోసిన నిర్మాత అయిన ఇతగాడి రాసలీలలు బయటికి వచ్చి సంచలనం రేపుతున్నాయి. ఏకంగా 34 మంది హీరోయిన్లను ఇతను బెదిరించి.. భయపెట్టి.. బలవంతంగా అనుభవించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీళ్లతో పాటు తన సంస్థలో పని చేయడానికి వచ్చిన అనేకమంది అమ్మాయిల్ని అతను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. బాధితులు బయటికి వచ్చి అతడిపై కేసు పెట్టడంతో అతడి కామ లీలలకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.

తాజాగా ఒక మోడల్ తో వీన్ స్టీన్ దారుణంగా మాట్లాడిన ఆడియో టేపు ఒకదాన్ని న్యూయార్క్ టైమ్స్ బయట పెట్టింది. ఆ ఆడియో టేపును వింటే.. అందులో వీన్ స్టీన్ ఓ అమ్మాయిని తన గదికి రమ్మని బలవంత పెడుతున్న విషయం తెలుస్తుంది. తన గదిలోకి వస్తే నీ కెరీర్ దిశా దశా మారిపోతుందని వీన్ స్టీన్ అంటుంటే.. తాను అలాంటిదాన్ని కాదని ఆమె అంటోంది. ‘అసలు నువ్వు నిన్న నా బ్రెస్ట్స్ ఎందుకు తాకావు.. ఎందుకు నొక్కాలని ప్రయత్నించావు. నేను షాకయ్యాను.. దయచేసి నన్నేమీ చేయకు’ అని ఆమె అంటుంటే అతను మాత్రం తనకిలాంటివి అలవాటే అని బదులిచ్చాడు. ఆమె తనకు మాత్రం ఇలాంటివి అలవాటు కాదని.. తానెంతగానో బాధపడుతున్నానని చెప్పింది. ఈ టేపులో వినిపించే వాయిస్ ఆంబ్రా బటిలానా అనే ఇటాలియన్ మోడల్ ది అంటున్నారు.

ఐతే ఇలాంటి ఆడియో టేపులు కోర్టుల్లో నిలవవని అంటున్నారు. ఐతే జనాలకు మాత్రం హర్వీ వీన్ స్టీన్ విషయంలో ఒక అంచనాకు రావడానికి ఈ ఆడియో టేపు ఉపకరిస్తోంది.