Begin typing your search above and press return to search.

ఏపిలో ’వాక్ ఇన్ మాల్స్’...మద్యమే మద్యం

By:  Tupaki Desk   |   26 Sept 2020 10:30 AM IST
ఏపిలో ’వాక్ ఇన్  మాల్స్’...మద్యమే మద్యం
X
మద్యం ప్రియులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న రోజులు తొందరలోనే వచ్చేస్తున్నాయి. అక్టోబర్ 1వ తేదీ నుండి అమలవ్వబోతున్న నూతన మద్యం పాలసీలో భాగంగా మద్యం ప్రియులు కోరుకున్న సరుకంతా దొరకబోతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్ విధానంలో ప్రముఖ బ్రాండ్లు చాలా పరిమిత సంఖ్యలో మాత్రం దొరుకుతున్నాయి. ఎప్పుడూ ఎవరు వినని బ్రాండ్లన్నింటినీ జనాల నెత్తిన రుద్దుతున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. చంద్రబాబునాయుడు, టిడిపి నేతలు ఈ ఆరోపణలను ఎప్పటి నుండో చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

బహుశా ఇటువంటి ఆరోపణలు, విమర్శలు ఇక నుండి వినిపించకపోవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయస్ధాయిలో దొరికే అన్నీ బ్రాండ్లతో పాటు చాలా పాపులర్ బ్రాండ్లను వాక్ ఇన్ షాప్స్ పద్దతిలో జనాలకు అందుబాటులోకి రాబోతున్నాయి. నగరాలు, జిల్లా కేంద్రాలు, పెద్ద పట్టణాల్లో గుర్తించిన ప్రాంతాల్లో మొదటి దశలో సుమారు 150 వరకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇటువంటి మాల్స్ ప్రస్తుతం హైదరాబాద్ లో కొన్నిచోట్ల అమల్లో ఉంది. ప్రస్తుతం ఇక్కడ చాలా పాపులర్ బ్రాండ్లన్నీ దొరుకుతున్నాయి. అంటే మధ్యం ప్రియులకు చాయిస్ ఎక్కువగా ఉంటుంది.

ఈ వాక్ ఇన్ షాప్స్ పద్దతిలో ఏర్పాటు చేయబోయే మద్యం షాపులున్న ప్రాంతాల్లో ఇప్పటికే అమ్మకాలు చేస్తున్న షాపులను తీసేస్తారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద 3500 మద్యం షాపులున్నాయి. అయితే ఇప్పటికే సుమారు వెయ్యి షాపుల లెసెన్సులను రద్దు చేసేయాలని గుర్తించింది. 2021 ఎక్సైజ్ పాలసీ ప్రకారం కేవలం 2934 షాపులకు మాత్రమే వేలంపాట నిర్వహించనున్నారు. కొత్త పాలసీ ప్రకారం ఏర్పాటుకానున్న వాక్ ఇన్ షాప్స్ ను ఏ పద్దతిలో ఎవరెవరికి అలాట్ చేయనున్నారో మాత్రం ప్రభుత్వం చెప్పలేదు.

కాకపోతే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కొత్త షాపులన్నీ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, పార్టీలోని కీలక నేతల ఖాతా లోనే పడతాయన్న విషయాలను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే అమల్లో ఉన్న బార్లు, మద్యంషాపులు చాలా వరకు అధికారపార్టీ నేతల చేతుల్లోనే ఉన్నాయనే ఆరోపణలు కొత్తేమీ కాదు. మద్యం ఆదాయం పై అధికార పార్టీ నేతలు కన్నేయటం మన రాష్ట్రలో కొత్తేమీ కాదు. ఎవరు అధికారం లో ఉంటే మెజారిటి వాటా వాళ్ళదే కదా. సరే కొత్త విధానంలో షాపులు ఎవరి చేతిలో ఉంటే ఏమిటి మద్యం ప్రియులకు ఇక నుండి పండగే పండగ.