Begin typing your search above and press return to search.

లాక్‌డౌన్ ప్ర‌క‌ట‌న‌ తో వైన్ షాపుల ముందు భారీ క్యూలు !

By:  Tupaki Desk   |   11 May 2021 12:44 PM GMT
లాక్‌డౌన్ ప్ర‌క‌ట‌న‌ తో వైన్ షాపుల ముందు భారీ క్యూలు !
X
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈనెల 12 నుంచి మే22 వరకు, అంటే 10 రోజులపాటు లాక్ డౌన్ అలు చేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే, కఠిన లాక్ డౌన్ కు ముందు నుండి ఉన్న సీఎం కేసీఆర్, రాబోయే 10 రోజులపాటు ఉదయం 6 నుంచి 10 గంటలవరకు మినహాయింపులు ఇచ్చారు. అంటే, 4గంటలపాటు జనం కదలికలు, వ్యాపారాలపై ఆంక్షలు ఉండవు. ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ అమల్లోకి వస్తుంది. లాక్‌ డౌన్ అట్ల ప్రకటించిందో లేదో, వైన్స్ షాపుల వద్ద మద్యం బాబులు బారులు తీరారు.

హైదరాబాద్ మహానగరంలో ఎటు చూసిన మద్యం దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ విధించినట్లు ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే మందు బాబులు వెంటనే అలర్ట్ అయ్యారు. పూర్తిస్థాయి లాక్ డౌన్‌ ను విధిస్తే వైన్ షాపులు కూడా మూత పడతాయి. కాబట్టి, ముందస్తుగానే మద్యం కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. వైన్ షాపులకు వెళ్లే వారిలో చాలా మంది ఫుల్ బాటిల్స్ కొనుక్కుని వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీనితో మద్యం దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిట లాడుతున్నాయి. ఈసందర్భంగా అటు వ్యాపారులు, ఇటు కొనుగోలుదారులు కరోనా నిబంధ నలు పాటించడం లేదు. అధికారులు ఆంక్షలు విధించినప్పటికి షాపుల వద్ద వీటిని ఎవరూ పట్టించుకోవడంలేదు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ భయానకంగా విజృంభిస్తుందని చెబుతున్నా, మందుబాబులు మాత్రం కొనుగోలుకు ఏ మాత్రం వెనకడుగు వెయ్యటం లేదు. ఇక మద్యం షాపుల వద్ద కరోనా వైరస్ ప్రబలకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాలని, మాస్కులు ధరించాలని , ఒకరికి ఒకరు తాకవద్దని చెప్పి పలు నిబంధనలు ఉన్నా లెక్క చేయడంలేదు. చాలామంది కేసుల కొద్దీ మద్యం, బీర్లు కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు.