Begin typing your search above and press return to search.

ఆంధ్రా తాగుబోతుల రచ్చకు కొట్టుకున్న మంత్రి - ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   13 May 2020 5:20 PM IST
ఆంధ్రా తాగుబోతుల రచ్చకు కొట్టుకున్న మంత్రి - ఎమ్మెల్యే!
X
ఆంధ్రా తాగుబోతులా మజాకా.. ఏపీలో ధరలు ఎక్కువగా ఉన్నాయని కర్ణాటకపై పడ్డారు.అక్కడ మద్యం తెగ తాగేశారు. దీంతో మంత్రి, ఎమ్మెల్యే కొట్టుకున్నారు. సరిహద్దులు మూసివేసినా దాటుకొని వచ్చేశారు. చివరకు మన తాగుబోతుల దెబ్బకు వైన్ షాపులే మూసివేసిన వైనం కర్ణాటక సరిహద్దుల్లో నెలకొంది.

లాక్ డౌన్ తో గొంతు ఎండిపోయిన మందుబాబులకు ఇటీవలే మద్యం షాపులు తెరవడంతో కొత్త ఊపిరి వచ్చింది.అయితే ఏపీలో మద్యం ధరలు 75శాతం పెంచడం వారికి శరాఘాతమైంది. లాక్ డౌన్ లో ఉన్న డబ్బులంతా మద్యానికే పోతాయని భయపడి కొందరు ఏపీలోని శివారు జిల్లాలకు చెందిన తాగుబోతులు పక్కరాష్ట్రాలకు వెళ్లి మద్యం తాగడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే ఏపీ మందుబాబుల వల్ల ఇప్పుడు కర్ణాటక మంత్రి - ఎమ్మెల్యే నువ్వానేనా అంటూ గొడవలు పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ దెబ్బకు ఆంధ్రా-కర్నాటక సరిహద్దుల్లో మద్యం షాపులు పూర్తిగా మూసేసిన పరిస్థితి నెలకొంది.

కర్ణాటకకు ఆనుకొని ఉన్న కర్నూలు - అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ తీవ్రంగా ఉంది. కర్నూలులో 584 కేసులు - 16 మంది చనిపోయారు. అనంతపురంలో 115 కేసులు - 4 మరణించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మద్యం ధరలు భారీగా ఉన్నాయని కర్ణాటకల సరిహద్దుల్లో ఉన్న బళ్లారి జిల్లాకు మందుబాబులు వలసపోతున్నారు. కర్ణాటకలోని గ్రామాల్లో ఎక్కడ చూసినా ఆంధ్రా తాగుబోతులే కనిపిస్తున్నారు. దీంతో అక్కడి ప్రజలు - అధికారులు తమకు కరోనా అంటుతుందోనన్న భయంతో చస్తున్నారు.

ఆంధ్రా తాగుబోతులు కర్ణాటక సరిహద్దుల్లోని వైన్ షాపులకు రావడంతో గ్రామాల ప్రజల్లో నిరసన వ్యక్తం అవుతోంది. ఇదే విషయంపై కర్ణాటక మంత్రి - బళ్లారి ఇన్ చార్జి మంత్రి ఆనంద్ సింగ్ - బళ్లారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆంధ్రా తాగుబోతులను ఎందుకు అరికట్టడం లేదని మంత్రి - ఎమ్మెల్యే మాటల యుద్ధం చేసుకున్నారు. ఒకరి మీద ఒకరు చేయి చేసుకొని కేసులు నమోదై కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

ఈ పరిణామంతో కర్ణాటక సర్కార్ అలెర్ట్ అయ్యింది. సరిహద్దుల్లో చెక్ పోస్టులు పెట్టి ఆంధ్రా తాగుబోతులను అడ్డుకుంటున్నారు. అయినా అడ్డదారులు - గుట్టలు ఎక్కి ఏపీ తాగుబోతులు రావడంతో చేసేదేం లేక బళ్లారి కలెక్టర్ సరిహద్దుల్లోని అన్ని వైన్ షాపులను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆంధ్రా తాగుబోతులే కాదు.. స్థానికులకు కూడా మద్యం దొరకని పరిస్థితి ఎదురైంది.