Begin typing your search above and press return to search.
బార్లు..క్లబ్బులు లేకుండా లిక్కర్ సేల్ ఆదాయం తెలిస్తే అవాక్కే
By: Tupaki Desk | 28 Sept 2020 1:40 PM ISTతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాలు కాసులు కురిపిస్తున్నాయి. అదెంత భారీగా అన్న విషయం తాజాగా ఒకరు సమాచార హక్కు చట్టం ద్వారా అప్లికేషన్ పెట్టుకోగా.. వారి నుంచి వచ్చిన సమాచారం ఆసక్తికరంగా మారింది. కరోనా కారణంగా మార్చి చివరి నుంచి మే ఐదు వరకు మద్యం అమ్మకాల్ని నిలిపివేయటం తెలిసిందే. గడిచిన నాలుగైదు నెలలుగానే మద్యాన్ని అమ్ముతున్నారు.
గతంలో మాదిరి బార్లు.. క్లబ్బులు లేవు. అయినప్పటికీ మద్యం అమ్మకాలతో భారీ ఎత్తున ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది. మే 6 నుంచి ఆగస్టు చివరకు వరకు జరిగిన మద్యం అమ్మకాల కారణంగా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా? అక్షరాల రూ.7.97వేల కోట్లుగా చెబుతున్నారు. అంటే దగ్గర దగ్గర రూ.8వేల కోట్లు. నెలకు రెండువేల కోట్ల మొత్తం మద్యం అమ్మకాలతోనే ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నట్లుగా తేలింది.
ఈ లెక్కన బార్లు.. క్లబ్బులు ఓపెన్ అయితే.. ఏడాది మొత్తం ఫుల్ గా బిజినెస్ సాగితే.. ఏడాదికి రూ.25వేల కోట్ల ఆదాయం మద్యం కారణం వచ్చే అవకాశం ఉందని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాది మద్యం అమ్మకాల కారణంగా రూ.6.09వేల కోట్లు రాగా.. ఈ ఏడాది ఐదు నెలల్లో వచ్చిన ఆదాయమే ఎక్కువగా చెప్పాలి.
ఈ లెక్కన రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఎంత జోరుగా సాగుతున్నాయనటానికి ఈ లెక్క ఒక్కటి చాలని చెప్పక తప్పదు. మొత్తంగా చూస్తే.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017-18 తప్పించి.. మిగిలిన అన్ని సంవత్సరాల్లో ఆదాయం పెరగటమే కానీ తగ్గటం అన్నది లేదని చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సమాచార హక్కు చట్టం కింద 2014 నుంచి ఇప్పటివరకు మద్యం తాగి ఎవరైనా మరణించారా? అన్న ప్రశ్నకు.. అలా ఎవరూ చనిపోలేదని పేర్కొన్నారు. ఇక.. రాష్ట్రంలో హైదరాబాద్.. నిజామాబాద్.. వరంగల్ లలో మాత్రమే మద్యం నాణ్యత పరీక్షా కేంద్రాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. చూస్తుంటే.. మద్యం అమ్మకాలు ప్రభుత్వానికి కల్పతరువుగా మారయనటంలో సందేహం లేదు.