Begin typing your search above and press return to search.

కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న తెలంగాణ మందుబాబులు!

By:  Tupaki Desk   |   13 May 2020 9:50 AM GMT
కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న తెలంగాణ మందుబాబులు!
X
తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. లాక్‌‌‌‌ డౌన్ స‌డ‌లింపులతో తెలంగాణ మందుబాబులు తెగ తాగేస్తున్నారు. దాదాపు నెలన్నర త‌ర్వాత మద్యం షాపులు తెరుచుకోవ‌డంతో మందు బాబులు తెగ తాగేస్తున్నారు. ఫ‌లితంగా లిక్క‌ర్ కలెక్షన్స్‌‌ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కేవ‌లం వారం రోజుల్లోనే లిక్కర్‌‌‌‌ సేల్స్‌‌‌‌ రూ.902 కోట్లకు చేరుకోవ‌డం గ‌మ‌నార్హం.

సాధారణ రోజులతో పోలిస్తే ఇప్పుడు మరింత రెట్టింపు అమ్మకాలు జరుగుతున్నాయి. మళ్లీ ఎక్కడ మద్యం షాపులు మూసేస్తారోనన్న అనుమానమే .. లేదా మద్యం తాగని 45 రోజులది ఇప్పుడు తాగేస్తున్నారో తెలియదు గానీ లిక్కర్‌ సేల్స్‌ మాత్రం భారీగా పెరిగాయి. ఇక తెలంగాణలో ఎక్కువ మద్యం అమ్మకాలు గ్రేటర్ హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. ఇదిలా ఉండ‌గా వైన్స్‌‌‌‌ మళ్లీ బంద్‌‌‌‌ చేస్తారనే వార్తలతో చాలామంది పెద్ద మొత్తంలో కొని పెట్టుకుని దాచుకుంటుండ‌టం గ‌మ‌నార్హం. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు లిక్కర్‌‌‌‌ అమ్మకాలకు అనుమతినిచ్చింది. ఇక ప్ర‌భుత్వం లిక్క‌ర్‌ పై సగటున 16 శాతం లిక్కర్‌‌‌‌ రేట్లు పెంచిన ఏమాత్రం కొనుగోళ్లు త‌గ్గ‌క‌ పోగా పెర‌గ‌డం విశేషం.

ఈ నెల 6న మొదలైన సేల్స్‌‌‌‌ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. 6వ తేదీ నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.902 కోట్ల మద్యం డిపోల నుంచి వైన్స్‌‌‌‌ కు త‌ర‌లించ‌గా రోజుకు సగటున రూ.129 కోట్ల మద్యం అమ్మ‌కాలు జ‌ర‌గ‌డం విశేషం. ఈనెల 8న అత్యధికంగా రూ.190 కోట్ల సేల్స్‌‌‌‌ జరిగిన‌ట్లు ఎక్సైజ్ శాఖ లెక్క‌ల ద్వారా తెలుస్తోంది. ఆదివారం మాత్రం కేవలం 37 కోట్ల రూపాయల మద్యమే అమ్ముడయ్యింది. కాగా, గతేడాది మేలో మొత్తం 1,847 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయని సమాచారం.