Begin typing your search above and press return to search.

తెలుగుప్రజలు ‘మత్తు’తో ఊగిపోయారు

By:  Tupaki Desk   |   2 Jan 2017 4:27 AM GMT
తెలుగుప్రజలు ‘మత్తు’తో ఊగిపోయారు
X
సమస్యలు ఎన్ని ఉన్నా సరే.. న్యూఇయర్ రోజున మందు గొంతులోకి దిగాల్సిందే. నిత్యం తాగి ఊగిపోయే మందుబాబులే కాదు.. మందుతో పరిచయం ఉన్న వారంతా దాదాపుగా టచ్ చేసే రోజుగా డిసెంబరు31వ తేదీని చెప్పక తప్పదు. పెద్దనోట్ల రద్దుతో కొత్త సంవత్సరం వేడుకలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంతమేర కళ తప్పినప్పటికీ.. మద్యం అమ్మకాల్లో మాత్రం జోష్ కంటిన్యూ అయ్యింది.

కరెన్సీ కటకటలు.. ఏటీఎం దగ్గర క్యూలైన్లు లాంటివేమీ.. డిసెంబరు31 రాత్రి సెలబ్రేషన్స్ కు మందుబాబులకు గుర్తుకురాలేదనే చెప్పాలి. దీనికి తోడు క్యాష్ తోనే కాదు.. క్యాష్ లెస్ గా కూడా మద్యం అమ్మకాల్ని జరపటం.. మామూలు రోజులకు భిన్నంగా అర్థరాత్రి వరకూ సాగిన అమ్మకాల పుణ్యమా అని మద్యం అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టించాయనే చెప్పాలి.

ఏడాదికేడాది మద్యం అమ్మకాలు అంతకంతకూ వృద్ధిరేటు నమోదు చేసే దానికి భిన్నంగా ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో గతేడాది డిసెంబరు 31 అమ్మకాల్ని టచ్ చేశాయి. పెద్దనోట్ల రద్దు కారణంగా.. కొత్త సంవత్సరం వేడుకలు కాస్తంత నీరసంగా సాగిన దాంతో పోలిస్తే.. మద్యం అమ్మకాల్లో వృద్ధి (తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే) రేటు కనిపించకున్నా.. గతేడాది ఫిగర్స్ ను రీచ్ అయ్యాయి. అదే సమయంలో ఏపీలో మాత్రం మద్యం అమ్మకాల్లో వృద్ధి రేటు నమోదుకావటం గమనార్హం.

తెలంగాణ వ్యాప్తంగా డిసెంబరు 31వ తేదీన రూ.74 కోట్ల మేర మద్యం అమ్మకాలు సాగటం గమనార్హం. గత ఏడాది(2015 డిసెంబరు 31న) ఇదే రోజున ఇంతే మొత్తంలో మద్యం అమ్మకాలు జరగటం చూస్తే.. ఈ ఏడాది కాసింత సేల్స్ తగ్గినట్లేనని చెప్పక తప్పదు.అదే సమయంలో గత ఏడాది డిసెంబరు నెల మద్యం అమ్మకాల్ని చూస్తే.. 2015 డిసెంబరు అమ్మకాలు రూ.1200కోట్లు కాగా.. ఈ ఏడాది రూ.1300 కోట్లు అమ్మకాలు జరిగాయి. ఇక.. ఏపీ విషయానికి వస్తే.. గత ఏడాది (2015) డిసెంబరు30.. 31 తేదీల్లో ఏపీ వ్యాప్తంగా రూ.100 కోట్ల మేర మద్యం అమ్మకాలు సాగితే.. ఈ ఏడాది మాత్రం రూ.20 కోట్ల మేర అమ్మకాలు సాగి మొత్తం రూ.120 కోట్ల మేర సేల్స్ సాగాయి. నోట్ల కటకట మద్యానికి మినహాయింపు కావటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/