Begin typing your search above and press return to search.

లిక్కర్ కింగ్ కొడుకు అరెస్ట్.. 100కోట్లకు టోకరా

By:  Tupaki Desk   |   13 Jun 2019 10:27 AM GMT
లిక్కర్ కింగ్ కొడుకు అరెస్ట్.. 100కోట్లకు టోకరా
X
ఒకటి కాదు.. రెండు కాదు.. 100 కోట్లకు పైగా మోసం.. సామాన్యుడి సొంతింటి కళను నిజం చేస్తానంటూ చౌకధరలకే ఇంటి ఫ్లాట్లను ఇప్పిస్తానంటూ హామీ ఇచ్చాడు బడా లిక్కర్ వ్యాపారి బారెన్ పాంటీ కుమారుడు.. వేవ్ గ్రూపును స్థాపించిన మణిప్రీత్ సింగ్ అలియాస్ మోంటీ చందా. ఇప్పుడు 100 కోట్లకు పైగా వసూలు చేసి బిచాణా ఎత్తివేశాడు. అతడు ఢిల్లీ విమానాశ్రయం నుంచి పారిపోతుండగా పసిగట్టిన ఆర్థిక నేరాల విభాగం అధికారులు అరెస్ట్ చేశారు. థాయ్ లాండ్ దేశం పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

వేవ్ గ్రూపు చైర్మన్ మోంటీ చందా లిక్కర్ కింగ్ బారెన్ కుమారుడు కావడంతో అంతా నమ్మారు. దీంతో ఉప్పల్-చద్దా హైటెక్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట సంస్థను స్థాపించాడు. 100 కోట్లను వసూలు చేసి సామాన్య, మధ్యతరగతి వారికి ఫ్లాట్లను ఇస్తానని ప్రలోభపెట్టాడు. యూపీలోని ఘజియాబాద్ లో హైటెక్ టౌన్ షిప్ పేరుతో వెంచర్ లాంచ్ చేశాడు. ఇళ్లు- విల్లాలు- గోల్ఫ్ కోర్టు- ఇంటర్నేషనల్ స్కూలు- కాలేజ్- షాపింగ్ మాల్స్ తదితర అత్యధునిక సౌకర్యాల ఫ్లాట్లు అంటూ జనాలను ప్రలోభపెట్టాడు. కానీ వారి వద్ద డబ్బులు వసూలు చేసి ప్లాట్లు కేటాయించలేదు.

అయితే 2018 జనవరిలో మోంటీ చద్దా ఓ కొనుగోలు దారును మోసం చేశాడు. దీంతో మోంటీపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. వేవ్ గ్రూపుతోపాటు ఇతర ప్రమోటర్లపై లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి.

2012లో మోంటీ చద్దా తండ్రి, లిక్కర్ కింగ్ బారెన్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. అప్పటి నుంచి బాధ్యతలు తీసుకున్న మోంటీ ఇలా కేసుల్లో ఇరుక్కొని జైలు పాలయ్యారు.