Begin typing your search above and press return to search.
మద్యం అమ్మకాలు ఏపీకి మూడు రకాలుగా నష్టమట
By: Tupaki Desk | 14 May 2020 11:00 AM ISTకొంతకాలంగా అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజాగా మాత్రం డైలీ బేసిస్ లో మాట్లాడుతున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. ఏపీలో జరుగుతున్న పరిణామాల మీద ఆయన స్పందిస్తున్నారు. తాజాగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మద్యం అమ్మకాల్ని షురూ చేసి పెద్ద తప్పు చేసినట్లుగా ఆయన చెబుతున్నారు.
ఏపీలో మద్యం అమ్మకాల కారణంగా రాష్ట్రాన్ని మూడు రకాలుగా నష్టం చేసిందన్న ఆవేదనను వ్యక్తం చేశారు. నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీసిందని..భారీగా ధరలు పెంచేయటం ద్వారా జనం జేబులు గుల్ల చేశారని.. మద్యం కోసం గుంపులు గుంపులుగా చేరటం వల్ల కేసులు భారీగా పెరిగే ప్రమాదం పొంచి ఉందన్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందన్న అంచనాను వినిపించారు.
పాలకులు అసమర్థులైతే ప్రజలు తీవ్రంగా నష్ట పోతారన్న తీవ్రమైన వ్యాఖ్యను చేస్తూ.. మద్యం అమ్మకాల్ని రాష్ట్ర ప్రభుత్వం షురూ చేయటాన్ని తప్పు పట్టారు. అదే సమయంలో ప్రధాని మోడీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని మెచ్చుకున్నారు. మద్యం అమ్మకాలతో మూడు రకాలుగా నష్టం జరిగిందన్న బాబు మాటల్లో వాస్తవం ఎంతన్నది కాలమే సమాధానం చెప్పాలి.