Begin typing your search above and press return to search.

అడవి రాజుల అంతుచిక్కని మరణాలు

By:  Tupaki Desk   |   13 Oct 2018 10:55 AM GMT
అడవి రాజుల అంతుచిక్కని మరణాలు
X
భారతదేశంలోనే సింహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అభయారణ్యం. ఇక్కడి ప్రాంతం సింహాలకు పెట్టింది పేరు. కానీ ఈ అభయారణ్యంలో గడిచిన 18 రోజుల్లో 21 సింహాలు మృతి చెందడం దేశవ్యాప్తంగా అందరినీ షాక్ కు గురిచేస్తోంది. దీనిపై గుజరాత్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రంగంలోకి దిగాయి.

గిర్ అడవుల్లో ఈ మద్య కార్చిచ్చు రేగడంతో అటవీ జంతువులకు ఆశనిపాతంగా మారింది. పచ్చని అడవుల శాతం తగ్గిపోయింది. నీటి వనరులు కూడా లభించక జంతువులన్నీ దాహంతో అలమటించి చచ్చిపోతున్నాయట.. రోగాల బారిన పడి వరుసగా మృతిచెందుతున్నారు. ఇప్పుడు మిగతా జంతువులతోపాటు సింహాలకు అంతుచిక్కని వ్యాధి సోకి మృత్యువాత పడుతున్నాయి.

సింహాలు సెప్టెంబర్ 12 నుంచి ఇప్పటివరకు 21 మృతిచెందడంతో గుజరాత్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏదో గుర్తు తెలియని వైరస్, ఇన్ఫెక్షన్ సోకడంతోనే ఈ సింహాలు మృతిచెందాయని అనుమానిస్తున్నారు. మృతిచెందిన నాలుగు సింహాల్లో వైరస్ లక్షణాలు కనిపించాయి. మరో ఆరు సింహాల్లో ప్రొటోజోవా ఇన్ ఫెక్షన్ ఉన్నట్టు జంతు వైద్యులు , అటవీశాఖ అధికారులు గుర్తించారు.