Begin typing your search above and press return to search.

సింహం పక్కన టీ తాగే దమ్ముందా.?

By:  Tupaki Desk   |   10 July 2018 1:30 AM GMT
సింహం పక్కన టీ తాగే దమ్ముందా.?
X

సింహాల పక్కన కూర్చొని టీ తాగే దమ్ముందా.? అంటే వామ్మో అంటారు. మన తెలుగు హీరోలైతే గ్రాఫిక్స్ లో తాగినట్టు యమ బిల్డప్ లు ఇస్తారు.. కానీ ఈ హోటల్ లో అది సాధ్యమే.. ఇస్తాంబుల్ లోని ఓ హాటల్ ఎప్పుడూ హౌస్ ఫుల్ గా ఉంటోంది. అక్కడి కస్టమర్లు గంటల తరబడి హోటల్లోనే కాలం గడిపేస్తున్నారట.. అందుకు కారణం ఆ హోటల్ లో తిరిగే సింహమే.. హోటల్ లో సింహమేంటి అని ఆశ్చర్యపోకండి.. ఆ హోటల్ యాజమాన్యం ఓ చిన్న సింహం పిల్లను తీసుకొచ్చి ఓ గ్లాస్ కేబిన్ లో ఉంచింది. ఇక అక్కడికి వచ్చే కస్టమర్లు సింహాన్ని చూస్తూ టిఫిన్ - టీ గట్రా లాగించేస్తున్నారు. అంతేకాదు కొందరు కేవలం ఆ సింహాన్ని చూసేందుకే అక్కడికి వచ్చి టీలు తెగ తాగేస్తున్నారట..

సింహం కస్టమర్లను చూస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటోంది. అయితే అది నడిచేందుకు స్థలం పెద్దగా ఆ గ్లాస్ డబ్బాలో లేదు. అయితే చిన్నగా ఉన్న సింహం పెద్దది అయితే మాత్రం కస్టమర్లకు తిప్పలు తప్పవని కొందరు కస్టమర్లు చెబుతున్నారు. సింహం ఎప్పుడో పెద్దది అవుతుందని ఇప్పుడు లాభాలు వదులుకోం కదా అని ఆ షాపు యజమాని వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే ఇలా మూగ జంతువును బంధించి వ్యాపారం పెంచుకోవడంపై జంతు ప్రేమికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2700 మంది అభ్యంతరం తెలుపుతూ పిటీషన్ పై సంతకాలు చేశారు.అయితే కేఫ్ యాజమాన్యం మాత్రం ఇందుకు లైసెన్స్ తీసుకున్నట్లు చెబుతోంది. అయితే ఈ బుల్లి సింహంతోపాటు 35 కుందేళ్లు - ఫ్లెమింగోలు - నాలుగు పాములు - నాలుగు గుర్రాలు - రెండు చిలకలు - రెండు మొసళ్లు కూడా ఈ హోటల్ లో ఉన్నాయట.