Begin typing your search above and press return to search.
కరోనా మరణాలు వయసును బట్టే : లానెట్స్ సర్వే!
By: Tupaki Desk | 1 April 2020 12:15 PM ISTకరోనా వైరస్ ..ప్రస్తుతం ప్రపంచాన్ని భయంతో వణికిపోయేలా చేస్తుంది. ఈ మహమ్మారి బయటపడిన చైనా లో దీని ప్రభావంగా తగ్గిపోయినా కూడా ...మిగిలిన దేశాలు వణికిపోతున్నాయి. ఇకపోతే ఈ కరోనా కారణంగా చనిపోయే వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటివరకు 42,327 మంది చనిపోయారు. కరోనా వైర్‌స తో మృతుల రేటు 0.0016 నుంచి 7.8 శాతంగా ఉందని, వయసు ఆధారంగానే మృతులూ ఉన్నారని 'ద లాన్సెట్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్' తాజా సర్వేలో తేల్చింది.
గతంలో కరోనా మరణాల రేటుని 0.2 నుంచి 1.6గా మాత్రమే అంచనా వేశారు. అయితే , ప్రస్తుతం పాత అంచనాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని తెలిపింది. లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ సహా వివిధ సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇంతవరకు జరిగిన సర్వేల్లో ఆసుపత్రి పాలైన వారి సంఖ్యను తీసుకోలేదు అని , చైనాలోని ఖరారు కాని కేసులనూ కలిపి మరణాల రేటు 0.66 శాతం. ఖరారైన కేసుల్లో మరణించిన వారి రేటు 1.38 శాతం. తొమ్మిదేళ్ళ లోపు పిల్లల్లో 0.0016 మరణాలు రేటు ఉండగా అదే 80 అంతకు మించి వయస్సు వారిని తీసుకుంటే ఇది 7.8 శాతంగా నమోదైంది అని ఆ సంస్థ తెలిపింది.
ఈ వివరాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు అంచనాల కంటే తక్కువగానే మరణాలు ఉన్నాయని తెలిపారు. 2009లో చోటుచేసుకున్న వైరస్ హెచ్1ఎన్ 1 తో పోల్చుకుంటే కరోనా వైరస్‌తో మృతుల మరణాల రేటే కొంచెం ఎక్కువుగా ఉందని ఆ బృందం తెలిపారు. మొత్తంగా ప్రపంచంలో 50 నుంచి 80 శాతం మంది ఈ వైరస్ బారిన పడవచ్చని, ఆసుపత్రి పాలయ్యే వారి సంఖ్య కూడా అధికం గానే ఉంటుందని వారు తెలిపారు. మొట్ట మొదట వైరస్ లక్షణాలను గుర్తించడం, మరణానికి మధ్య ఉన్న రోజులు 17.8 కాగా వ్యాధి నుంచి కోలుకునేందుకు పట్టేది 22.6 రోజులని అధ్యయనం లో తేలింది.