Begin typing your search above and press return to search.
వారానికి అన్నిసార్లు శృంగారం చేస్తే.. అంతలా ఆయుష్షు పెరుగుతుందట
By: Tupaki Desk | 12 Oct 2021 9:52 AM ISTవినేందుకు విచిత్రంగానే కాదు.. ఆసక్తికరమైన కాన్సెప్టు ఇప్పుడు చర్చకు వచ్చింది. ఆరోగ్యంగా ఉండటం.. ఆయుష్షును పెంచుకోవటం కోసం ఏం చేయాలి? అన్నంతనే భారీ చిట్టాను ఎవరికి వారు విప్పేస్తుంటారు. ఇలా చెప్పే వారి జాబితాలో ఒకటి మాత్రం కచ్ఛితంగా మిస్ అవుతుంటుంది. అదే.. శృంగారం. ముఖంలో రంగులు మారాయా? మారొచ్చు.. కానీ నిజమని తెలిస్తే.. మారిన ముఖం కాస్తా కొత్త వెలుగులు రావటం ఖాయం.
మంచి ఆహారాన్ని తీసుకోవటం.. కంటి నిండా నిద్రపోవటం.. దురలవాట్లకు దూరంగా ఉండటం లాంటివి ఆయుష్షును పెంచేస్తాయని చాలామంది భావిస్తారు. కానీ..వాటితో పాటు శృంగారం కూడా తప్పనిసరి. సరైన రీతిలో శృంగారం తరచూ చేయటం ద్వారా ఏకంగా 20 ఏళ్ల ఆయుష్షును పెంచుకోవటం సాధ్యమన్న మాట.. ఇటీవల నిర్వహించిన అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రెగ్యులర్ శృంగారం మరణించే ముప్పును తగ్గిస్తుందన్న విషయం తేలింది.
ఎందుకిలా అంటే.. శృంగారం అన్నది ఆత్మీయ సంబంధంలో చేసేది కావటం.. దీనితో వచ్చే మానసిక బలం ఆయుష్షును పెంచుతుందని చెబుతున్నారు. దీంతో.. దిగులు.. కుంగుబాటు లాంటివిఉండవని.. ఇదో వ్యాయామంగా కూడా ఉంటుందని చెబుతున్నారు. నిత్యం వ్యాయామం చేయటం గుండెకు మేలు చేస్తుంటుంది. అలానే.. తరచూ శృంగారం చేసే వారిలో రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది.
తాజాగా జరిపిన అధ్యయనాల ప్రకారం వారానికి ఒక్కసారి అంతకంటే తక్కువ సార్లు శృంగారం చేసే వారితో పోలిస్తే.. వారానికి రెండుసార్లు శృంగారం చేసే వారి లాలాజలంలో ఇమ్యునోగ్లోబులిన్ ఏ మోతాదు ఎక్కువగా ఉంటుందని.. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు. సో.. తినే తిండి.. చేయాల్సిన వ్యాయామాలతో పాటు.. శృంగారం మీదా కాసింత ఫోకస్ చేస్తే.. ఎంచక్కా ఆయుష్షును పెంచేసుకోవచ్చన్నది తాజాగా చేసిన అధ్యయనాల సారాంశం. ఇంకెందుకు ఆలస్యం.. ట్రై చేసి చూడకూడదు?