Begin typing your search above and press return to search.

ఎల్ ఐసీ.. ఆదాయ‌మే ఆదాయం!

By:  Tupaki Desk   |   28 Dec 2019 6:25 AM GMT
ఎల్ ఐసీ.. ఆదాయ‌మే ఆదాయం!
X
ప్ర‌భుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా.. మ‌రో ఏడాది కూడా భారీ లాభాల‌ను ఆర్జించింది. భారీ లాభాల‌తో కేంద్ర ప్ర‌భుత్వానికి భారీ మొత్తం డివిడెండ్ ను కూడా చెల్లించింది ఎల్ఐసీ. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వానికి 2,611 కోట్ల రూపాయ‌ల డివెడెంట్ ను ఎల్ఐసీ చెల్లించింది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కు ఎల్ఐసీ ఈ మేర‌కు చెక్కును అందించింది.

ఈ సంద‌ర్భంగా ఎల్ఐసీ ఆదాయ వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. గ‌త సంవ‌త్స‌రంలో ఎల్ఐసీ ప‌ది శాతం వృద్ధిని న‌మోదు చేసింద‌ట‌. దీని విలువ 53,214 కోట్ల రూపాయ‌లు అని తెలుస్తోంది. ఇక పాల‌సీల ప‌రంగా కూడా ఎల్ఐసీ మార్కెటింగ్ విలువ పెరిగింద‌ట‌. ఎల్ఐసీ అర‌వై మూడు సంవ‌త్స‌రాలను పూర్తి చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎల్ఐసీ ఆస్తుల విలువ 31.11 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అని తెలుస్తోంది.

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలోనే ఎల్ఐసీ ఏకంగా 5.61 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ఆదాయాన్ని ఆర్జించ‌డం గ‌మ‌నార్హం. ఇలా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లాభ‌సాటిగా న‌డుస్తున్న కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌గా త‌న ఉనికి చాటుతూ ఉంది.

ఒక‌వైపు ఇన్సూరెన్స్ మార్కెటింగ్ లో ప్రైవేట్ సంస్థ‌లు పోటీకి వ‌చ్చాయి. పోస్టాఫీస్ తో స‌హా మ‌రి కొన్ని ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు - ప్ర‌భుత్వ బ్యాంకులు కూడా బీమా సేవ‌ల‌ను అందిస్తూ ఉన్నాయి. అయినా ఎల్ఐసీ మాత్రం త‌న స్థాయిని నిల‌బెట్టుకుంటూ సాగుతూ ఉంది. జ‌నాల న‌మ్మ‌క‌మే పెట్టుబ‌డిగా ఈ సంస్థ విజ‌య బావుటా ఎగ‌రేస్తోంది.