Begin typing your search above and press return to search.

భాదితుల భాద్యత మాది .. ఎల్జీ పాలిమర్స్ హామీ!

By:  Tupaki Desk   |   9 May 2020 10:30 AM GMT
భాదితుల భాద్యత మాది ..  ఎల్జీ పాలిమర్స్ హామీ!
X
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ ఘటన పై ఎల్జీ పాలిమర్స్ ఇండియా ఎట్టకేలకి స్పందించింది. రెండు రోజుల క్రితం జరిగిన ఆ ఘటన చాలా బాధాకరం అని .. ఈ ప్రమాద బాధితులకు తమ సానుభూతిని, క్షమాపణలు చెప్తున్నాం అని తెలిపింది. తమ కంపెనీ ప్రభుత్వం, సంబంధిత అధికారులతో కలిసి ప్రమాదానికి కారణాలపై విచారణ జరుపుతున్నామన్నారు. భవిష్యత్ ‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాధమిక విచారణ ప్రకారం.. స్టైరిన్ మోనోమర్‌ స్టోరేజ్ ట్యాంక్ జీపీపీఎస్‌ దగ్గర వాపర్ లీకేజ్‌తో ప్రమాదం జరిగిందని తేలిందంటోంది.

ప్రస్తుతం కంపెనీలో పరిస్థితి అదుపులో ఉందని, అలాగే తాము ప్లాంట్ ‌లో స్టైబిలైజింగ్ ‌పై ఫోకస్ పెట్టామంటున్నారు.అలాగే ఇదే సమయంలో ఈ ప్రమాద బాధితులకు, ఆ కుటుంబాలకు అండగా ఉంటామని, వారికి వీలైనంత వరకు మేలు చేస్తామని, వారి బాధ్యతను తీసుకుంటామన్నారు. ప్లాంట్‌లో తమ సిబ్బంది పగలు, రాత్రి తేడా లేకుండా ప్రభుత్వంతో కలిసి కష్టపడుతోందని, జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి, సమర్థవంతమైన సంరక్షణ ప్యాకేజీని అందించడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ ప్రమాద బాధితులు, చనిపోయిన వారి కుటుంబాలకు సాయం చేయడానికి, అండగా ఉండటానికి, ఒకవేళ ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి ఓ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే భాదిత అన్ని కుటుంబాలను త్వరలోనే సంప్రదిస్తామని అంటున్నారు. ఈ టీమ్ అస్వస్థతకు గురైనవారికి అవసరమైన వైద్యం, ఇతర సాయం అందించేందుకు పని చేస్తోందన్నారు. అలాగే ప్రమాదంలో అస్వస్థతకు గురైనవారికి, బాధితులకు మానసిక స్థైర్యాన్ని నింపుతామన్నారు. భవిష్యత్‌ లోనూ స్థానికుల్లో భరోసా నింపే కార్యక్రమాలు చేపడతామంటున్నారు. అయితే , ఆ కంపెనీని అక్కడి నుండి తరలించాలని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.