Begin typing your search above and press return to search.
ఎల్ జీ సంచలనం.. ల్యాప్ టాప్ లో కొత్త శకం షురూ కానుందా?
By: Tupaki Desk | 22 Nov 2020 10:07 AM ISTమారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక మార్పులు చోటు చేసుకోవటం మామూలే. సంప్రదాయ పద్దతుల్ని చుట్ట చుట్టేసి.. సరికొత్త సౌకర్యాల్ని అందుబాటులోకి తెచ్చేస్తే లభించే ఆదరణ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అలాంటి అంశాన్నే తీసుకుంది ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్ జీ. ల్యాప్ టాప్ రూపురేఖలు మొత్తంగా మార్చేయటమే కాదు.. చుట్టేసేందుకు వీలైన వాటిని తయారు చేసేందుకు వీలుగా జోరుగా ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి సదరు కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
కాకుంటే.. ఈ తరహా ల్యాపీల పేటెంట్ కోసం ఎల్ జీ చేసుకున్న దరఖాస్తు ఆన్ లైన్ లో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. మిగిలిన ల్యాపీల మాదిరే ఈ ఫోల్డబుల్ ల్యాపీల్లో కీ బోర్డు.. టచ్ ప్యాడ్ లు ఉండనున్నాయి. రాబోయే రోజుల్లో మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తున్న ఈ రోలబుల్ ల్యాపీలు 13.3 - 17 అంగుళాల సైజుల్లో తయారు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఈ ల్యాపీల్ని చుట్టేసినప్పుడు సౌండ్ బార్ లా తయారవుతుందని చెబుతుున్నారు. దీనికి కీ బోర్డుతో పాటు.. పవర్ బటన్ కూడా ఉంటుందని చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లుగా సాగితే.. వచ్చే ఏడాది ఈ సరికొత్త ఆవిష్కరణ ప్రపంచం ముందుకు వస్తుందని చెబుతున్నారు. అదే జరిగితే.. ల్యాపీల్లో సరికొత్త శకం షురూ అయినట్లే.