Begin typing your search above and press return to search.

గ్యాస్ లీకేజీపై ఎల్‌జీ కెమికల్స్ స్పందన !

By:  Tupaki Desk   |   7 May 2020 4:40 PM IST
గ్యాస్ లీకేజీపై ఎల్‌జీ కెమికల్స్ స్పందన !
X
ఈ రోజు తెల్లవారుజామున విశాఖపట్నం లో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదం కారణంగా రాష్ట్రంతో పాటు దేశం కూడా ఒక్కసారిగా ఉలికి పడింది. విశాఖపట్నం జిల్లాలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ ప్లాంట్ నుంచి విషవాయువులు లీకైంది. దానితో చాలామంది మూర్ఛ పోయారు. వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు ..తదితర అధికారులు స్పందించి భాదితులని కేజీహెచ్ కి తరలించారు. ప్రస్తుతం అక్కడ భాదితులకు మెరుగైన చికిత్సను అందిస్తున్నారు.

తాజాగా ఈ ఘటనపై దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ కెమికల్స్ స్పందించింది. ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ఎల్‌జీ కెమికల్స్ ప్రస్తుతం గ్యాస్ లీకేజీ అదుపులోకి వచ్చినట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో కరోనావైరస్ కట్టడికి అమలువుతున్న దేశవ్యాప్త లాక్‌ డౌన్ కారణంగా ప్రభావిత కర్మాగారాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. లీక్ ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. లాక్‌ డౌన్ సడలింపులతో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో నైట్ షిఫ్ట్ కార్మికుడు ట్యాంక్ నుండి లీక్‌ ను గుర్తించినట్టు దక్షిణ కొరియా ప్రతినిధి తెలిపారు.

ప్రస్తుతం పట్టణవాసులకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాం. సంబంధిత సంస్థల సహకారంతో ప్రజలు, తమ ఉద్యోగులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎల్‌జీ పాలిమర్స్ యజమాన్య సంస్థ ఎల్‌జీ కెమ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రమాదంలో లీకైన వాయువు పీల్చినపుడు వికారంతోపాటు మైకం ఆవరిస్తుందని తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, వారికి చికిత్స పొందేలా చూడాలని కోరుతున్నట్లు తెలిపింది.