Begin typing your search above and press return to search.

గాడ్సే గే...ఆయ‌న‌ తో క‌లిసింది హిందూ ప్ర‌ముఖుడు

By:  Tupaki Desk   |   3 Jan 2020 6:07 AM GMT
గాడ్సే గే...ఆయ‌న‌ తో క‌లిసింది హిందూ ప్ర‌ముఖుడు
X
నాథురాం గాడ్సే... జాతిపిత మ‌హాత్మాగాంధీ హంత‌కుడు. ఆయ‌న గురించి లెక్క‌లేన‌న్ని వివాదాలు ఉన్నాయి. అయితే, తాజాగా మ‌రో వివాదాస్ప‌ద అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆయ‌నంతో పాటుగా హిందూ మహాసభ సహ వ్యవస్థాపకుడు వీర్‌ సావర్కర్ గురించి సైతం కాంగ్రెస్‌ సేవాదళ్ క‌ల‌క‌లం రేకెత్తించే కామెంట్లు చేసింది. భోపాల్‌ లో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్‌ జాతీయ శిక్షణా శిబిరం జ‌రుగుతోంది. దీనికి హాజరైన వలంటీర్లకు ‘వీర్‌ సావర్కర్‌ కిత్నే వీర్‌? (వీర్‌ సావర్కర్‌ వీరత్వం ఎంత?) అన్న శీర్షికన ముద్రించిన ఈ పుస్తకాన్ని కాంగ్రెస్ పార్టీ పంచిపెట్టింది. ఈ పుస్తకం లో హిందూ మహాసభ సహ వ్యవస్థాపకుడు వీర్‌ సావర్కర్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. మహాత్మాగాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేకు, సావర్కర్‌కు మధ్య స్వలింగ సంపర్కం ఉండేదని తెలిపింది.

1947లో జరిగిన దేశ విభజనకు ఆరెస్సెస్‌, సావర్కర్‌ కారణమని సేవాద‌ళ్ ఆరోపించింది. డొమినిక్‌ లాపియెర్రె, లారీ కోలిన్స్‌ రాసిన ‘ఫ్రీడం ఎట్‌ మిడ్‌నైట్‌' పుస్తకం నుంచి ఒక ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, ‘బ్రహ్మచర్యాన్ని స్వీకరించడానికి ముందు గాడ్సే ఒకే ఒకసారి లైంగిక సంపర్కంలో పాల్గొన్నా డు. ఆయన తన రాజకీయ గురువైన వీర్‌ సావర్కర్‌తో స్వలింగ సంపర్క సంబంధం పెట్టుకున్నాడు’ అని సేవాదళ్‌ పుస్తకం పేర్కొంది. గాడ్సేతో సావర్కర్‌కు స్వలింగ సంపర్క సంబంధం ఉండేదని, మైనారిటీలకు చెందిన మహిళలపై లైంగికదాడులు చేయాలని ఆయన హిందువులను రెచ్చగొట్టేవాడని ఈ పుస్తకంలో ఆరోపించింది.

ఇదిలాఉండ‌గా, ఈ రెండు పుస్తకాలపై బీజేపీ ప్రతినిధి రజనీశ్‌ అగర్వాల్‌ స్పందించారు. వాస్తవాలను వక్రీకరిస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందన్నారు. సావర్కర్‌పై పోస్టల్‌ స్టాంప్‌ను విడుదలచేస్తూ నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనను స్వాతంత్ర సమరయోధుడుగా అభివర్ణించారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నేత‌లు ఇందిరా మాట‌ల‌ను కొట్టిపారేస్తున్నారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.