Begin typing your search above and press return to search.
చైనా వస్తువులను నిషేధించి ఆత్మనిర్భర్ సాధిద్దాం: మోడీ
By: Tupaki Desk | 15 Aug 2020 12:00 PM ISTభారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని మోడీ రాజ్ ఘాట్ లో నివాళులర్పించి ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసి ప్రసంగించారు. భద్రతాదళాల గౌరవవందనం స్వీకరించారు.
తన ప్రసంగంలో చైనాకు షాకిచ్చేలా మోడీ ప్రసగించారు. చైనా వస్తువులను పూర్తిగా నిషేధించాలన్నారు. ఇతర దేశాల వస్తువులను కూడా నిషేధించి ఇకపై మన వస్తువులను మనమే తయారు చేసుకోవాలన్నారు. వోకల్ ఫర్ లోకల్ అనే మాటను నిలబెట్టుకుందామని ప్రధాని మోడీ చెప్పుకొచ్చాడు. దేశంలో అందుకు సరిపడా సహజ వనరులు సంవృద్ధిగా ఉన్నాయని తెలిపారు.
కరోనా వచ్చిన కష్టకాలంలో దేశంలో పీపీఈ కిట్స్, ఎన్-95 మాస్కులు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండేదని మోడీ తెలిపారు. కానీ ఇప్పుడు సొంతంగా భారత్ లో తయారుచేస్తున్నామని వివరించారు. ఒకప్పుడు భారత వస్తువులంతే ప్రపంచమంతా గౌరవం ఉండేదని.. ఇప్పుడు మళ్లీ పూర్వ వైభవం తెచ్చేప్రయత్నం చేద్దామన్నారు. నాలుగు నెలల్లో స్వయం సంవృద్ధి సాధించి ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నామని వివరించారు. ప్రజలంతా దేశ ఉత్పత్తులకు తగిన ప్రోత్సాహం కల్పించాలని సూచించారు. యువతకు కొత్త అవకాశాలు కల్పించాలన్నారు. అన్ని రంగాల్లో సంస్కరణలు చేశామన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ పేరుతో భారత్ తయారీ వస్తువులను ప్రపంచానికి ఉత్పత్తి చేయాలని మోడీ పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ ఒక నినాదం కావాలని సంకల్పించారు. మన రైతులు దేశాన్ని ఆకలిరాజ్యం నుంచి అన్నదాతగా మలిచారు. దేశ రవాణా రంగం గతినే మార్చేశారు.
వ్యవసాయం, బ్యాంకింగ్, వెనుబడిన వర్గాల అభివృద్ధి కోసం కొత్త పథకాలు ప్రారంభించామని.. వ్యవసాయంలో నూతన శకానికి నాంది పలికామని మోడీ అన్నారు. ఆహారశుద్ధి, తాగునీరు, ఆరోగ్యం సహా అన్ని రంగాల్లో భారత్ దూసుకు పోతుందని మోడీ అన్నారు.