Begin typing your search above and press return to search.

వైఎస్‌పై ప్రేమ ఉంటే.. మ‌రో వ‌ర్సిటీ తేవ‌చ్చుగా! నెటిజన్ల కామెంట్లు

By:  Tupaki Desk   |   21 Sep 2022 10:30 AM GMT
వైఎస్‌పై ప్రేమ ఉంటే.. మ‌రో వ‌ర్సిటీ తేవ‌చ్చుగా! నెటిజన్ల కామెంట్లు
X
విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీకి.. వైఎస్సార్ హెల్త్ యూనివ‌ర్సిటీగా పేరు మారుస్తూ..ఏపీ ప్ర‌భుత్వం.. బిల్లును అసెంబ్లీలో పెట్టి పాస్ చేయించుకుంది. ఈ సంద‌ర్భంగా అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య తీవ్ర వాదోప‌వాదాలు.. మాటల యుద్ధాలు కూడా జ‌రిగాయి. స‌రే.. ఇప్పుడు.. దీనిపై సీఎం జ‌గ‌న్ చేసిన కామెంట్లు.. చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. బిల్లు ప్ర‌వేశ పెట్టిన త‌ర్వాత‌.. ముఖ్యమంత్రి జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి..రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌. మూడు వైద్య కాలేజీలు తీసుకువ‌చ్చార‌ని.. సీఎం చెప్పారు. 1983కు ముందు రాష్ట్రంలో కేవ‌లం 8 కాలేజీలు వుంటే.. వైఎస్ వ‌చ్చాక 3 ఉన్నాయ‌న్నారు. ఆ త‌ర్వాత‌.. ఇంక ఎవ‌రూ దీనిపై శ్ర‌ద్ధ పెట్ట‌లేద‌న్నారు. పైగా.. వైఎస్ హ‌యాంలో ఆరోగ్య శ్రీ, 104, 108 వంటి సేవ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చార‌ని.. సీఎం చెప్పారు. ఇక‌, రాజ‌కీయాల్లోకి రాక‌ముందు.. ఆయ‌న రూపాయి డాక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నార‌ని.. అప‌ర సంజీవ‌ని.. వంటి ఆరోగ్య శ్రీని.. ప్ర‌జ‌ల‌కు చేరువ చేసిన‌ట్టు తెలిపారు.

అలాంటి మ‌హానాయ‌కుడు.. వైఎస్‌కు స‌రైన న్యాయం జ‌ర‌గ‌లేద‌ని.. ఆయ‌న వైద్య రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా.. రాష్ట్రంలో ఎలాంటి ప్రాజెక్టు లేకుండా పోయింద‌ని.. సీఎం జ‌గ‌న్ అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. అందుకే.. ఆమ‌హ‌నీయుడికి నివాళిగా.. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రి త‌ర‌ఫున‌..

ఆయ‌న‌కు గౌర‌వం ఇవ్వాల‌నే సంక‌ల్పంతోనే.. తాము ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీకి.. వైఎస్సార్ హెల్త్ యూనివ‌ర్సిటీగా పేరు మారుస్తున్నామ‌ని.. సీఎం జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ఇందులో.. ఎన్టీఆర్‌ను త‌క్కువ చేసి చూడ‌డం.. అగౌర‌వ ప‌ర‌చ‌డం అనేది లేద‌న్నారు.

దీనిపై నెటిజ‌న్లు ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. తండ్రిగా రాజ‌శేఖ‌ర‌రెడ్డిపై సీఎం జ‌గ‌న్‌కు అభిమానం ఉండ‌డాన్ని ఎవ‌రూ కాద‌న‌రని వారు పేర్కొంటున్నారు. అయితే.. ఎవ‌రో పెట్టుకున్న పేరును మార్చి ఇప్పుడు వైఎస్సార్ పేరు పెట్ట‌డం ఎందుకు? అని ప్ర‌శ్నిస్తున్నారు.

నిజానికి మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క వైద్య యూనివ‌ర్సిటీని తీసుకువ‌చ్చి.. దానికి వైఎస్సార్‌.. పేరు పెట్టి ఉంటే.. రాష్ట్రంమొత్తం హ‌ర్షించేద‌ని.. చెబుత‌న్నారు. కేంద్రంలో ఎలానూ యాక్సిస్ ఉంది కాబ‌ట్టి.. మ‌రో వ‌ర్సిటీని ఏర్పాటు చేస్తే.. బాగుండేద‌ని... చెబుతున్నారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణ‌యం..దొడ్డిదారిలో వెళ్లి రిబ్బ‌న్ క‌టింగ్‌కు హాజ‌రైన‌ట్టు ఉంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.