Begin typing your search above and press return to search.

దేశంలో 50 వేలకు దిగువగా కరోనా కేసులు... !

By:  Tupaki Desk   |   28 Jun 2021 5:30 AM GMT
దేశంలో  50 వేలకు దిగువగా కరోనా కేసులు... !
X
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు మరింతగా తగ్గిపోతున్నాయి. నిన్నటితో పోల్చి చూస్తే కరోనా పాజిటివ్ కేసులు కొంచెం తగ్గుముఖం పట్టడం విశేషం. సెకండ్ వేవ్ విజృంభణ గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టడంతో, గ‌డ‌చిన 24 గంట‌ల వ్యవధిలో కొత్తగా 58,578 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అటు, క‌రోనా బారినపడి ఆదివారం ఒక్కరోజే 979 మంది ప్రాణాలను కోల్పోయారు. దీనితో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,02,79,331కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్‌ లో వెల్లడించింది.

కాగా, ఆదివారం క‌రోనా నుంచి 2.93 లక్షల మంది కోలుకున్నారు . ఇదే స‌మ‌యంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా త‌గ్గింది. గ‌డ‌చిన 24 గంట‌ల్లో క‌రోనా వైరస్ తో చనిపోయిన 979 మందితో కలిపి మొత్తం క‌రోనా మరణాల సంఖ్య 3,96,730కు చేరింది. దేశంలో ప్రస్తుతం క‌రోనాకు చికిత్స పొందుతున్న వారిసంఖ్య 3,02,79,331కు చేరింది. గత, 24 గంటల్లో క‌రోనా కార‌ణంగా మహారాష్ట్రలో అత్యధికంగా మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో రిక‌వ‌రీ రేటు 96.80 శాతంగా ఉంది.

ఇదిలా ఉంటే ఆల్పా, గామా, డెల్టా, డెల్టా ప్లస్ వంటి ప్రమాదకర కరోనా వేరియంట్ల స్థానంలో ఇప్పుడు ‘లాంబ్డా’ కూడా వచ్చి చేరింది. గతేడాది ఆగస్టులో పెరులో బయటపడిన ఈ రకం ఇప్పుడు 29 దేశాలకు విస్తరించింది. ఇందులో పెరు సహా చిలీ, ఈక్వెడార్, అర్జెంటినా వంటి దేశాలు ఉన్నాయి. ఈ వేరియంట్‌ను ‘దృష్టి సారించాల్సిన వైరస్ రకం’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనగా, ‘పరిశోధనలో ఉన్న కరోనా రకం’గా బ్రిటన్‌లోని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ వెల్లడించింది. బ్రిటన్‌ లో ఇప్పటి వరకు ఈ తరహా కేసులు ఆరు మాత్రమే వెలుగుచూశాయి. ఏప్రిల్ నుంచి పెరులో బయటపడిన కొత్త కేసుల్లో లాంబ్డా రకానికి చెందినవి ఏకంగా 81 శాతం ఉండడం ఆందోళన కలిగిస్తోంది. చిలీలో గత 60 రోజుల్లో ఈ కేసులు 32 శాతానికి పెరిగాయి. దీని స్పైక్ ప్రొటీన్‌ లోని కొన్ని ఉత్పరివర్తనాల వల్ల ఇది ఉద్ధృతంగా వ్యాపించే ప్రమాదం ఉందని చెబుతున్నారు.