Begin typing your search above and press return to search.

లీక్ దెబ్బ పడకుండా ఉండేందుకు ప్రగతిభవన్ లోనే ఆ దుకాణం?

By:  Tupaki Desk   |   2 Oct 2022 3:35 AM GMT
లీక్ దెబ్బ పడకుండా ఉండేందుకు ప్రగతిభవన్ లోనే ఆ దుకాణం?
X
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా సమాలోచనలు జరపటం.. అందుకు అవసరమైన భారీ కసరత్తులు పూర్తి చేయటం తెలిసిందే. ఏది ఏమైనా.. జాతీయ పార్టీ పెట్టాల్సిందేనని డిసైడ్ అయిన ఆయన.. మోడీని దెబ్బ కొట్టటమే లక్ష్యంగా ఆయన ఇప్పుడు పార్టీ పెడుతున్న సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించిన ఏర్పాట్లు యమా ఫాస్టుగా జరిగిపోతున్నాయి. తాను పెట్టుకుంటుందన్నది మోడీతో అన్న విషయం కేసీఆర్ కు తెలియనిది కాదు. అందుకే ఆయన భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పలు అంశాల మీద అంతులేని గుట్టును ప్రదర్శిస్తున్నారు. పార్టీ జెండా.. ఎజెండా.. పార్టీ పేరు మొదలు.. పలు కీలక అంశాలకు సంబంధించి ఏ విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

అయినప్పటికీ కొన్ని విషయాలు బయటకు పొక్కుతున్నాయి. దీంతో.. ఈ లీకుల షాకుల్ని తగ్గించేందుకు.. అధికారిక ప్రకటనకు ముందు మరే విషయం బయటకు రాకూడదన్న ఉద్దేశంతో సరికొత్త కసరత్తు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీ పేరును.. దాని లోగోను తయారు చేసేందుకు ప్రత్యేక కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఒక టీంను ప్రగతిభవన్ లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి మరీ.. సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీ పేరు లోగో.. పార్టీ పతాకాన్ని తీర్చిదిద్దే టీంను కొద్ది రోజులుగా ప్రగతి భవన్ లో ప్రత్యేక విడిది ఏర్పాటు చేయటమే కాదు.. వారిని బయటకు పోనివ్వకుండా.. దసరా వరకు అక్కడే ఉంచేలా ఏర్పాట్లు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ పని చేస్తున్న వారికి సెల్ ఫోన్ అన్నది అందుబాటులో లేకుండా ఉంచటం.. ప్రత్యేక పర్యవేక్షణను చేపట్టినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో.. ఈ టీంకు అవసరమైన కొన్ని ఇన్ ఫుట్స్ కు తమ మీడియా సంస్థలోని అతి ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వారి సేవల్ని కూడా వినియోగించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.