Begin typing your search above and press return to search.

ఎన్నికల బరిలో సినీ నటి రాధిక

By:  Tupaki Desk   |   4 March 2021 9:30 AM IST
ఎన్నికల బరిలో సినీ నటి రాధిక
X
దక్షిణాది ప్రముఖ నటి కూడా ఎన్నికల బరిలో దిగుతోంది. భర్త బాటలోనే తాను ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తోంది. ఈ మేరకు పోటీకి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.

తాజాగా ప్రముఖ నటి శరత్ కుమార్ ఎన్నికల్లో పోటీచేయబోతున్నారు. శరత్ కుమార్ ఆదేశిస్తే ఎన్నికల బరిలోకి దిగుతానని ఆమె తెలిపారు. ఇంతకాలం అన్నాడీఎంకే కూటమిలో ఉన్నామని.. తమకు కరివేపాకులా తీసిపారేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన భర్త శరత్ కుమార్ ధైర్యవంతుడని.. ఈ ఎన్నికల్లో ఎస్ఎమ్‌కే పార్టీ బలమెంతో నిరూపిస్తామని ఆమె చెప్పారు. చెన్నైలోనే వేలాచ్చేరి లేదా దక్షిణ తమిళనాడులోని ఉసిలంపట్టి స్థానాల నుంచి రాధిక పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

తమిళనాడు ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై ఎస్ఎమ్‌కే పార్టీ అధినేత శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ఆయన చెప్పారు. కూటమి తరపున పోటీ చేసే స్థానాలపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. తమను థర్డ్ ఫ్రంట్ అంటున్నారని, తమదే ఫస్ట్ ఫ్రంట్ అని ఆయన చెప్పుకొచ్చారు.