Begin typing your search above and press return to search.

దేనికి సంకేతం..జగన్ తో భేటీకి పోటెత్తుతున్నారుగా?

By:  Tupaki Desk   |   8 April 2019 10:18 AM IST
దేనికి సంకేతం..జగన్ తో భేటీకి పోటెత్తుతున్నారుగా?
X
ఏపీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నట్లుగా ప్రచార మాధ్యమాల్ని చూస్తే అనిపించక మానదు. కానీ.. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని.. వార్ వన్ సైడ్ అన్న మాట అంతకంతకూ పెరుగుతోంది. ఏపీ అధికారపక్షం ఎన్నికల్లో తెల్ల జెండా ఎగురవేసినట్లేనని.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమన్న మాట అంతకంతకూ పెరుగుతోంది.

కీలకమైన ఎన్నికల ప్రచారానికి మూడు రోజుల ముందు.. జగన్ ను కలుస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పలు సంఘాలకు చెందిన వారు.. వివిధ గ్రూపులకు చెందిన వారు విపక్ష నేతను కలిసి.. తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బాబు వ్యతిరేకులు ఇప్పటికే జగన్ వద్దకు రాగా.. ఇప్పుడు మరికొందరు జగన్ ను కలిసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అపాయింట్ మెంట్ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. పలువురు నేతలు.. పలు సంఘాలకు చెందిన వారంతా జగన్ నివాసమైన లోటస్ పాండ్ కు పోటెత్తుతున్న పరిస్థితి. మారిన గాలికి ఇదో నిదర్శనంగా పలువురు చెబుతున్నారు.

జగన్ పార్టీ ఎన్నికల హామీ ప్రణాళిక విడుదలైన నాటి నుంచి మరిన్ని సంఘాలు వైఎస్సార్ కాంగ్రెస్ కు తమ మద్దతు పలుకుతున్నారు. తమ సమస్యల్ని ప్రస్తావిస్తున్న తీరుపై వారు ఫిదా అవుతున్నారు. తమ మద్దతు జగన్ కే నంటూ వారు ప్రత్యేకంగా కలిసి మరీ చెప్పి వెళుతున్న తీరు దేనికి సంకేతమన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారతోంది.