Begin typing your search above and press return to search.

వైసీపీలోకి నేతలు.. చంద్రబాబు కోవర్ట్ ఆపరేషన్?

By:  Tupaki Desk   |   8 Oct 2019 8:55 AM GMT
వైసీపీలోకి నేతలు.. చంద్రబాబు కోవర్ట్ ఆపరేషన్?
X
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును అంత తేలికగా తీసుకోవడానికి లేదు. కుటిల వ్యూహాల్లో, వెన్నుపోటు గేమ్స్ లో చంద్రబాబు నాయుడిని మించినోడు లేరని అంటారు పరిశీలకులు. అలాగే అన్ని పార్టీల్లోనూ తనవారు కొందరిని పెట్టుకోవడం, కోవర్టు ఆపరేషన్లను నడిపించడంలో కూడా చంద్రబాబు నాయుడి టాలెంట్ అంతా ఇంతా కాదు!

ఇలాంటి క్రమంలో తెలుగుదేశం అధినేత తన పార్టీ నుంచి కొందరిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి కూడా పంపుతున్నారనే టాక్ మొదలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయి, అక్కడ ఏం జరుగుతోందో తనకు తెలియజెప్పే బాధ్యతను కొంతమందికి అప్పగిస్తున్నారట చంద్రబాబు నాయుడు. ఇన్ని రోజులూ చంద్రబాబు మీద వీరవిధేయతను చూపిన కొంతమంది ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతుండటంతో ఈ అనుమానాలు మొదలవుతూ ఉన్నాయి.

చంద్రబాబు మెప్పుకోసం కొంతమంది నేతలు అయినకాడికి మాట్లాడారు. అంతకు ముందంతా వైసీపీలో కొనసాగి కూడా చంద్రబాబు పంచన చేరాకా నోటికొచ్చినట్టుగా మాట్లాడారు. అడ్డగోలుగా వ్యవహరించారు. జగన్ మీద విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా నడుచుకున్నారు.

తీరా తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో అలాంటి వాళ్లనోళ్లు మూతలుపడ్డాయి. ఆ ట్రూప్ లోని కొంతమంది ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చేరుతూ ఉన్నారు. తిరిగి వారు జై జగన్ అంటూ ఉన్నారు. జగన్ చేతిలో అధికారం ఉండటమే.. ఇలాంటి వాళ్ల చేరికలకు కారణం అని వేరే చెప్పనక్కర్లేదు.

ఇలాంటి వారిని గుడ్డిగా నమ్మవద్దని, వీరు చంద్రబాబు నాయుడి చేతిలోని పావులు కూడా కావొచ్చని పరిశీలకులు అంటున్నారు. చంద్రబాబుకు ఇలాంటి కోవర్టు ఆపరేషన్లు కొత్త కాదని, వాటిని ఎరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత నడుకచుకోవాలని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.