Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్, చంద్రబాబు.. మరో రహస్యం చెప్పిన లక్ష్మీపార్వతి

By:  Tupaki Desk   |   6 March 2020 11:49 AM IST
ఎన్టీఆర్, చంద్రబాబు.. మరో రహస్యం చెప్పిన లక్ష్మీపార్వతి
X
ఎన్టీఆర్ ను గద్దెదించి టీడీపీని హస్తగతం చేసుకున్న చంద్రబాబు అంటే ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతికి ఆదినుంచి ద్వేషమే. బాబును తిట్టిన తిట్ట తిట్టకుండా తిడతారామే.. ఆ ఆగ్రహం ఎన్నాళ్లు అయినా చల్లారదేమో.. తాజాగా మరోసారి చంద్రబాబుపై శివాలెత్తి పోయారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్న చంద్రబాబును లక్ష్మీపార్వతి కడిగేశారు.

నాడు రాజకీయాలు చేస్తే ఎన్టీఆర్ మెడపట్టి చంద్రబాబును బయటకు నెట్టారని.. తనను వాడుకొని మళ్లీ ఎన్టీఆర్ పంచన చంద్రబాబు చేరాడని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.చంద్రబాబు జీవితం అంతా ఇలాంటి నీచ రాజకీయాలకే సరిపోయిందని అన్నారు.

చంద్రబాబును నమ్మి అమరావతిలో పెట్టుబడులు పెట్టిన వారంతా మునిగిపోయారని.. రోడ్డున పడ్డారని.. ఆ పాపం బాబుకే తగులుతుందని లక్ష్మీపార్వతి మండి పడ్డారు.

అమరావతి పేరిట చంద్రబాబు వసూలు చేసిన విరాళాలు కోట్ల సొమ్ము ఏమయ్యాయని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో కోట్లు పోగేసుకున్న చంద్రబాబు.. ఆ డబ్బును ఖర్చు చేయకుండా పేదల నుంచి వసూలు చేశాడని విమర్శించారు. మహిళలతో నేడు అంతర్జాతీయ న్యాయ స్థానాన్ని ఆశ్రయించడం సిగ్గుచేటన్నారు.