Begin typing your search above and press return to search.

సాయం ఎలా చేస్తారో చెబితే బాగుండు రెడ్డి సాబ్

By:  Tupaki Desk   |   9 Jun 2016 5:22 PM IST
సాయం ఎలా చేస్తారో చెబితే బాగుండు రెడ్డి సాబ్
X
అవిభక్త కవలలు వీణా.. వాణిలను వేరు చేయటం సాధ్యం కాదని ఎయిమ్స్ వైద్యులు తేల్చి చెప్పటంతో వారి భవిష్యత్తు ఏమిటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. గడిచిన పదమూడేళ్లుగా వీణా వాణిల నరకాన్ని చూస్తున్న తెలుగు ప్రజలు.. ఎయిమ్స్ వైద్యులు స్పందనతో హతాశులయ్యే పరిస్థితి. వీణా వాణిలను వేరు చేసి.. వారు స్వేచ్ఛగా తిరుగుతుంటే చూడాలని ప్రతి తెలుగు మనసు కోరుకుంది.

కానీ.. అందుకు భిన్నంగా ఎయిమ్స్ వైద్యులు తేల్చి చెప్పిన నేపథ్యంలో.. తర్వాత ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఈ అవిభక్త కవలలకు సంబంధించిన సమాచారం మీడియాలో పెద్దఎత్తున రావటం.. పలువురి స్పందనల నేపథ్యంలో మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. ఈ ఇద్దరు చిన్నారుల్ని తాము ఆదుకుంటామని.. వారికి అవసరమైన సాయం చేస్తామని లక్ష్మారెడ్డి వెల్లడించారు.

నిజానికి ఇలాంటి మాటలు గడిచిన పుష్కరకాలంగా అందరూ చెబుతున్నదే. కానీ.. నేతల మాటలు మాటలుగానే ఉన్నాయే తప్పించి.. వీణా..వాణిల పరిస్థితుల్లో మార్పు లేదు. ఇప్పటికైనా ఈ ఇద్దరు అవిభక్త కవలల విషయంలో ప్రభుత్వం ఎలాంటి సాయం అందించనుందన్న విషయాన్ని మంత్రి లక్ష్మారెడ్డి లాంటి వారు స్పష్టంగా వెల్లడిస్తే బాగుంటుంది. రెగ్యులర్ గా చెప్పే మాటలు చెప్పేసి సరిపుచ్చటం కన్నా.. ఈ అవిభక్త కవలల్ని వేరు చేసేందుకు కార్యాచరణను మంత్రి ప్రకటించి ఉండే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.