Begin typing your search above and press return to search.

చింటూకు లాయరే షెల్టర్ ఇచ్చారా?

By:  Tupaki Desk   |   2 Dec 2015 9:38 AM GMT
చింటూకు లాయరే షెల్టర్ ఇచ్చారా?
X
న్యాయాన్ని కాపాడాల్సిన వృత్తిలో ఉండి కూడా అన్యాయంగా వ్యవహరించిన వైనమిది. చిత్తూరు మేయర్ కటారి అనురాధ.. ఆమె భర్త మోహన్ లను నగర కార్పొరేషన్ కార్యాలయంలో దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చింటూ.. తప్పించుకుపోవటం.. పోలీసులు ఎంత వెతికినా అతడి జాడ కనిపెట్టలేకపోవటం తెలిసిందే. రీసెంట్ గా తనకు తానే చిత్తూరుజిల్లా కోర్టులోని న్యాయమూర్తి వద్ద నాటకీయ పరిణామాల మధ్య లొంగిపోయాడు.

అనంతరం అతడిని పోలీసుల విచారణకు అప్పజెప్పారు. మేయర్.. ఆమె భర్తను హత్య చేసిన వారిలో చింటూనే ప్రధానంగా పాల్గొన్నాడని ఆరోపణ. హత్య చేసిన తర్వాత పారిపోయిన చింటూ ఎక్కడ తలదాచుకున్నాడన్నది పెద్ద సందేహంగా మారింది. ఇదే విషయాన్ని పోలీసుల విచారణలో ఎదురుకావటంతో.. తాను ఒక లాయర్ ఇంట్లో ఆశ్రయం పొందినట్లుగా చింటూ తెలిపినట్లు తెలుస్తోంది. చింటూ ఇచ్చిన సమాచారంతో.. అతనికి అక్రమంగా ఆశ్రయం కల్పించిన లాయర్ ఆనంద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక సంచలన హత్య కేసులో ప్రధాన నిందితుడు.. పోలీసులు ఎంత వెతికినా దొరకని వ్యక్తిని ఒక లాయర్ షెల్టర్ ఇచ్చి కాపాడటం సంచలనంగా మారింది.