Begin typing your search above and press return to search.

ప్రియురాలితో గదిలో..భార్యకు రెడ్ ​హ్యాండెడ్​ గా దొరికిన లాయర్​!!

By:  Tupaki Desk   |   7 Nov 2020 5:40 PM IST
ప్రియురాలితో గదిలో..భార్యకు రెడ్ ​హ్యాండెడ్​ గా దొరికిన లాయర్​!!
X
ప్రియురాలితో రొమాన్స్​ చేస్తూ భార్యకు రెడ్​ హ్యాండెడ్ ​గా దొరికి పోయాడో భర్త. ఈ ఘటన శనివారం తిరుపతిలో జరిగింది. ప్రియురాలితో ఉన్నప్పుడు భార్య రెడ్​హ్యాండెడ్​గా పట్టుకోవడంతో గోడదూకి పారి పోయాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ సదరు మహిళ.. భర్త ప్రేయసి ఇంటి ముందు ఆందోళ చేపట్టింది. ఇందుకు సంబంధించిన వివరాలు.. తిరుపతిలోని పద్మావతినగర్​కు చెందిన చంద్రమౌళి స్థానికకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. అతనికి చాలా క్రితమే కవిత అనే మహిళతో వివాహమైంది. కానీ అతడు మరో యువతి తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అదే కాలనీ లో మరో ఇంటిని అద్దె కు తీసుకొని ప్రియురాలిని అక్కడ ఉంచాడు. ఈ విషయం తెలిసిన భార్య కవిత.. వీరిద్దరినీ రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుకొనేందుకు బంధువులతో కలిసి భర్త ప్రియురాలు ఉంటున్న ఇంటికి వెళ్లింది.

ఆ సమయంలో చంద్రమౌళి.. అతడి ప్రేయసి ఇంట్లోనే ఉన్నారు. భార్య వచ్చిన విషయాన్ని పసిగట్టిన చంద్రమౌళి ఇంటి వెనక నుంచి గోడదూకి పరారయ్యాడు. డబ్బు ఆశచూపి అనేకమంది యువతులతో చంద్రమౌళి వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని సమాచారం. గతంలో కాల్‌మనీ కేసులో అరెస్టయినట్లు సమాచారం. భర్త అక్కడి నుంచి పారి పోవడం తో ప్రియురాలి ఇంటి ఎదుటే భార్య కవిత నిరసన కు దిగింది. రోడ్డు పై బైఠాయించి తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది.