Begin typing your search above and press return to search.

వెంకయ్య హాట్ కామెంట్..బస్సు బీరు బిర్యానీ

By:  Tupaki Desk   |   9 Jan 2020 5:36 PM IST
వెంకయ్య హాట్ కామెంట్..బస్సు బీరు బిర్యానీ
X
దేశంలో ఎన్నికల వ్యవస్థపై ఉపరాష్ట్రపతి వెంకయ్య సెటైర్లు వేశారు.. బీరు, బిర్యానీ, జనసమీకరణకు ప్రజలు దూరంగా ఉండాలని కోరారు. ‘రాజకీయాల్లో ధన ప్రభావం’ అనే అంశంపై హైదరాబాద్ వర్సిటీలో వెంకయ్య ప్రసంగించారు. దేశంలో ఎన్నికలు జరుగుతున్న తీరు సరిగా లేదని.. సంస్కరణలు తేవాలని వెంకయ్య సూచించారు.

ఆరునెలలకోసారి దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయని.. ఇది సరికాదని.. దేశంలో పంచాయితీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకూ అన్ని ఒకే వారంలో నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇది ఒక్కటే చక్కటి పరిష్కారం అని సూచించారు.

ఐదేళ్లకోసారి ఎన్నికలు జరగడం వల్ల హామీలు, మద్యం పంపిణీ లాంటి వాటికి ముగింపు లభిస్తుందని వెంకయ్య అన్నారు. పార్టీలకు కూడా తమ మేనిఫెస్టో అజెండా అమలుపై స్పష్టత ఉంటుందని వెంకయ్య అన్నారు.

ప్రస్తుతం ఆరునెలలకోసారి ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు జరపడం వల్ల 3బీ ఫార్ములా బస్సు బీరు బిర్యానీ పద్ధతి దేశంలో పెరిగిపోయిందని వెంకయ్య విమర్శించారు.