Begin typing your search above and press return to search.

లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టం .... యూపీలో తొలి కేసు నమోదు !

By:  Tupaki Desk   |   30 Nov 2020 8:00 AM IST
లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా  చట్టం .... యూపీలో తొలి కేసు నమోదు !
X
ఎంతో వివాదాస్పదమైన లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా యూపీ చట్టం తెచ్చింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆనంది బెన్ పటేల్ జారీ చేశారు. చట్టంగా ఇది శనివారం నుంచే అమలులోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. యూపీ ప్రొహిబిషన్ ఆఫ్ అన్ లా ఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలిజన్ ఆర్డినెన్స్-2020 గా దీన్ని వ్యవహరిస్తున్నారు. లవ్ జిహాద్ కు అడ్డుకట్ట వేసేందుకు, బలవంతపు మతమార్పిడిని నివారించేందుకు ఈ కొత్త చట్టం దోహదపడుతుందని ప్రభుత్వం చెప్తుంది. ఇక, ఈ చట్టం కింద బరేలీ జిల్లా డియోరానియా పోలీస్ స్టేషన్‌ లో తొలికేసు నమోదైంది. యువతిని మత మారమని బలవంతం చేశాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదుచేశారు.

వేరే మతానికి చెందిన నిందితుడుయువతిని వివాహం చేసుకుని ఆమెను మతం మారాలని బలవంతం చేసినట్టు ఫిర్యాదు అందింది. దీనికి యువతి అంగీకరించకపోవడంతో తరుచూ ఆమె ఇంటికొచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు. తను చెప్పినట్టు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్టు బాధితులు ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. ఫిర్యాదు అధారంగా నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 504, 506 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని తెలిపారు.

ఈ ఘటనపై అదనపు ఎస్పీ సన్సార్ సింగ్ మాట్లాడుతూ.. డియోరానియాలోని షరీఫ్‌నగర్‌కు చెందిన యువకుడు యువైష్ అహ్మద్, బాధిత యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమెను మతం మారి, తనతో కాపురం చేయాలని బలవంతం చేశాడు అని అన్నారు. ఈ చట్టం కంప్యూటర్ డేటాబేస్‌ లో ఇంకా నిక్షిప్తం కానందున, మ్యానువల్ ‌గా చేర్చాం, నిందితుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు, అతడిని పట్టుకోవడానికి బృందాలను నియమించాం, ఫిర్యాదుదారుడి ఇంటి వద్ద కూడా భద్రతను ఏర్పాటుచేశాం అని అన్నారు. యూపీ తాజా చట్టం ప్రకారం.. మైనర్లను, ఎస్సీ, ఎస్టీ మహిళలతో పాటు ఇతర పౌరులను చట్ట విరుద్ధంగా మతం మారాలంటూ ఒత్తిడి తెచ్చే వారికి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించవచ్చు.