Begin typing your search above and press return to search.
ఏపీకి వచ్చేస్తున్న ‘లావా’
By: Tupaki Desk | 26 Oct 2015 11:11 AM ISTతన పాలనలో ఐటీకి హైదరాబాద్ ను కేరాఫ్ అడ్రస్ గా మారిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన మేజిక్ ను మరోసారి ప్రదర్శిస్తున్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ఆయన.. విభజన నేపథ్యంలో అటూఇటూ కాకుండా పోయిన సీమాంధ్రకు సరికొత్త సొగసలు అద్దే ప్రయత్నం చేస్తున్నారు.
తన హయాంలో సాఫ్ట్ వేర్ లో మేటిగా హైదరాబాద్ మార్చిన ఆయన.. ఏపీకి మొబైల్ లుక్ తెచ్చే ప్రయత్నంలో ఒక్కొక్క అడుగు వేస్తున్నారు. మొబైల్ కంపెనీలకు అడ్డాగా చిత్తూరు జిల్లాను మార్చే దిశగా చంద్రబాబు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని మొబైల్ కంపెనీలు ఏపీకి వచ్చేసి.. తమ ఉత్పత్తుల్ని మొదలు పెట్టాయి.
తాజాగా మరో మొబైల్ కంపెనీ ఏపీకి వచ్చేందుకు రెఢీ అవుతోంది. ప్రముఖ బ్రాండ్లలో ఒకటైన లావా తన మొబైల్ తయారీ కేంద్రాన్ని ఏపీలో పెట్టాలని డిసైడ్ అయింది. తిరుపతికి సమీపంలోని 20 ఎకరాల్లో రూ.500 కోట్లతో ఈ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ నెలకొల్పనున్నారు.
ఇందుకోసం లావా కంపెనీ దాదాపు రూ.500కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఏపీకి లావా రాకతో దాదాపు 12వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. పరోక్షంగా వేలాది మందికి లబ్థి చేకూరుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీ సర్కారుతో డీల్ ఓకే చేసుకున్న లావా.. మరో రెండేళ్లలో తన ఫ్లాంటు నిర్మాణాన్ని పూర్తి చేయనుంది. 2017లో ఈ ఫ్లాంటు ద్వారా లావా ఫోన్లను ఉత్పత్తి చేస్తారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. మొబైల్ ఫోన్ల అడ్డాగా ఏపీ మారుతుందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదన్న మాట వినిపిస్తోంది.