Begin typing your search above and press return to search.

పంజాబ్ లో హంగ్ తప్పదా ?

By:  Tupaki Desk   |   22 Feb 2022 12:30 PM GMT
పంజాబ్ లో హంగ్ తప్పదా ?
X
ఎన్నికలు ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్నప్పటికి ఉత్కంఠ మాత్రం రెండు రాష్ట్రాల విషయంలోనే ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో మొదటిది ఉత్తరప్రదేశ్ అయితే రెండోది పంజాబ్. యూపీలో ఇప్పటికి పూర్తయ్యింది మూడు విడతల పోలింగ్ మాత్రమే. ఇంకా జరగాల్సిన పోలింగ్ నాలుగు విడతలుంది. అదే పంజాబ్ ను తీసుకుంటే ఒకే విడతలో 117 సీట్లకు పోలింగ్ పూర్తయిపోయింది. అందుకనే పంజాబ్ లో ఏర్పడబోయే ప్రభుత్వంపై చాలామందిలో ఉత్కంఠ పెరిగిపోతోంది.

దీనికి కారణం ఏమిటంటే మొదట్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంచి లీడ్ లో ఉంది. ఆప్ లీడ్ లో ఉన్నపుడు కాంగ్రెస్ అంతర్గత కులహాల్లో కూరుకుపోయింది. తర్వాత ముఖ్యమంత్రి మార్పు, పీసీసీ అధ్యక్షుడి మార్పు తర్వాత కొత్త సీఎం, కొత్త పీసీసీ అధ్యక్షుడు కలవటం లాంటి అంశాలతో కాంగ్రెస్ కూడా పుంజుకుందనే ప్రచారం పెరిగింది.

ఇదే సమయంలో హర్యానా జైల్లో శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా రామ్ రహీం గుర్మీత్ (డేరా బాబా) బెయిల్ పై విడుదలయ్యారు.

ఇలాంటి అంశాలతో పంజాబ్ ఎన్నికల్లో ఎవరికీ ఏకపక్ష విజయం సాధ్యంకాదనే ప్రచారం పెరిగిపోతోంది. దానికి తోడు పోలింగ్ శాతం బాగా తగ్గిపోయింది.

2017లో 77 శాతం పోలింగ్ జరిగితే తాజా ఎన్నికల్లో 68 శాతం మాత్రమే నమోదైంది. దాదాపు 10 శాతం పోలింగ్ తగ్గిపోయిన నేపధ్యంలో దీని ప్రభావం ఎవరిమీద పడుతుందో అని విశ్లేషణలు మొదలైపోయాయి. కాంగ్రెస్ పుంజుకునే కొద్దీ ఆప్ కు ముందు దెబ్బ పడుతుందంటున్నారు.

అలాగే లక్షలాది మంది భక్తులుండే డేరా బాబా వల్ల బీజేపీ గనుక పుంజుకుంటే ఆ దెబ్బ కాంగ్రెస్ మీద పడుతుందని అంచనా వేస్తున్నారు. సంవత్సరాలుగా జైల్లోన ఉంటున్న డేరా బాబాకు హఠాత్తుగా బెయిల్ వచ్చిందంటే అది బీజేపీ నేతల వల్లే అనే ప్రచారం తెలిసిందే. తన భక్తులకు చెప్పి బీజేపీకి ఓట్లేయించే ఒప్పందం మీద డేరా బాబాకు బీజేపీ బెయిల్ వచ్చేట్లు చేసిందనే ప్రచారం పెరిగిపోతోంది. పోలింగ్ అయిపోగానే బెయిల్ కాలపరిమితి కూడా ముగియటమే దీనికి బలం చేకూరుస్తోంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది, విశ్లేషణలు చూస్తుంటే పంజాబ్ లో హంగ్ వచ్చేందుకే అవకాశం ఎక్కువున్నట్లు అనిపిస్తోంది. మరి ఓటర్ తీర్పు ఎలాగుందో.