Begin typing your search above and press return to search.

షాకింగ్ వీడియోను షేర్ చేసిన ల‌తా ర‌జ‌నీకాంత్!

By:  Tupaki Desk   |   22 July 2019 4:58 AM GMT
షాకింగ్ వీడియోను షేర్ చేసిన ల‌తా ర‌జ‌నీకాంత్!
X
త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ స‌తీమ‌ణి ల‌తా ర‌జ‌నీకాంత్ తాజాగా పోస్ట్ చేసిన ఒక వీడియో షాకింగ్ గా మారింది. ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆ వీడియోలో ఒక ప‌సిపాప‌ను.. ఒక మ‌హిళ దారుణంగా హింసిస్తున్న వైనం క‌నిపిస్తోంది. అనాథ పిల్ల‌ల ర‌క్ష‌ణ కోసం ద‌యా ఫౌండేష‌న్ అనే ఎన్జీవోను నిర్వ‌హిస్తున్న ఆమె.. పీస్ ఆఫ్ చిల్ట్ర‌న్స్ పేరుతో సేవా కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హిస్తున్నారు.

ఒక మ‌హిళ ఒక బాలిక‌ను కాలితో త‌న్న‌టం.. నోటితో చెప్ప‌లేని రీతిలో తొక్కుతూ.. న‌లిపేసిన దృశ్యాలు ఉన్నాయి. 27 సెక‌న్ల పాటు ఉండే ఈ వీడియోను చూసినంత‌నే గుండెలు అదిరేలా ఉండ‌ట‌మే కాదు..ప‌సిగుడ్డుపై ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మా? అన్న సందేహం క‌లిగేలా ఉందా వీడియో. అందులో చిత్ర‌వ‌ధ‌కు గురైన చిన్నారి గురించి తెలిసిన వారు త‌మ‌కు స‌మాచారం అందించాల్సిందిగా కోరారు.

హింస‌కు గురైన చిన్నారి ఆచూకీ తెలిసిన వారు త‌మ‌కు స‌మాచారం అందించాల్సిందిగా కోరారు. అంతేకాదు.. ఒక ఫోన్ నెంబ‌రు ను ఇచ్చి.. ద‌య‌చేసి త‌మ‌కు స‌మాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.ల‌తా ర‌జ‌నీకాంత్ షేర్ చేసిన వీడియో సంచ‌ల‌నంగా మారింది. వీడియోలో ఉన్న చిన్నారి గురించి ఆచూకీ తెలిసిన వారు 18001208866 టోల్ ఫ్రీ నెంబ‌రుకు వివ‌రాలు అందించాల్సిందిగా కోరారు.


For Video Click Here