Begin typing your search above and press return to search.

పబ్ నుంచి స్టేషన్ కు తీసుకొచ్చినోళ్ల వాదనేంది? వాళ్లేం చెబుతున్నారు?

By:  Tupaki Desk   |   4 April 2022 4:26 AM GMT
పబ్ నుంచి స్టేషన్ కు తీసుకొచ్చినోళ్ల వాదనేంది? వాళ్లేం చెబుతున్నారు?
X
ఇదిగో తోక అంటే.. అదిగో పులి అనేస్తే? ఎలా ఉంటుంది? రాడిసన్ బ్లూ స్టార్ హోటల్ లోని పబ్ లో జరిగిన డ్రగ్స్ వినియోగం ఎపిసోడ్ పై వస్తున్న వార్తలు.. మీడియాలో పేర్కొంటున్న తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి. అవగాహన లేకుండా.. తెలిసిన విషయాల్ని.. తెలియని విషయాల్ని కలగాపులగం చేయటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న. రాడిసన్ బ్లూ హోటల్ ప్రాంగణంలో ఉండే ఒక పబ్ లో డ్రగ్స్ వినియోగం జరుగుతుందన్న సమాచారం వచ్చింది. పోలీసులు వెళ్లి తనిఖీలు చేశారు. అక్కడ ఐదు గ్రాముల డ్రగ్స్ దొరికాయి. ఇంతవరకు ఓకే. ఎవరు తప్పు పట్టరు. ఆ మాటకు వస్తే.. పబ్ లో ఉన్న వారు సైతం.. ఈ తనిఖీల్ని స్వాగతిస్తారు.

సమస్యంతా ఆ తర్వాత నుంచే మొదలైందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఉదాహరణకు పబ్ ఎంట్రీకి యాప్ ఉంటుంది. దానికో ఓటీపీ వస్తుందని చెబుతూ చిలవలుపలవులుగా రాసేస్తున్నారు. నిజంగా ఏం జరుగుతుందో చూస్తే.. అసలు విషయం అర్థమవుతుంది. హైదరాబాద్ లోనే కాదు.. చాలా మహానగరాల్లో పబ్ లు నిర్వహించే వారు.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. మరింత బాగా అర్థం చేసుకోవాలంటే.. ఈ పబ్ గురించి చెప్పాలి.

రాడిసన్ బ్లూ హోటల్ లో ఏర్పాటు చేసిన ‘పుడింగ్ మింక్ పబ్’ కు అందరిని అనుమతించరు. ఇందులో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. కాకుంటే.. ఈ పబ్ లో మెంబర్లకు తెలిసిన వారిని కూడా అనుమతిస్తారు. అందుకే ఓటీటీ విధానం. ఎందుకిలా? అంటే.. పబ్ లోకి వచ్చే ప్రతి ఒక్కరి వివరం దీనిలో ఉంటుంది. దీంతో.. పబ్ నిర్వహణ స్మూత్ గా జరిగేందుకు వీలుగా ఈ సెటప్ ను వాడుతుంటారు. ఎవరో ముక్కు ముఖం తెలినీ వారు వచ్చి.. ఏదో చేసే కన్నా.. ఒక పరిమిత సమూహానికి యాక్సిస్ ఇచ్చే ఏర్పాటుగా దీన్ని చెప్పొచ్చు.

కానీ.. ఈ విధానాన్ని మీడియా అర్థం చేసుకున్నది భిన్నంగా ఉంది. పబ్ లో జరిగే దారుణాలు బయటకు రాకుండా ఉండటానికి వీలుగా యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే పబ్ లోకి అనుమతి అంటూ రాసేస్తున్నారు. కానీ.. శనివారం రాత్రి పబ్ కు వచ్చిన వారిలో చాలామంది పబ్ వద్ద సభ్యత్వం తీసుకున్న వారు కాదు. వారి స్నేహితులు.. తెలిసిన వారి ద్వారా లోపలకు వెళ్లారు. అయితే.. ఇక్కడో వాస్తవాన్నిఒప్పుకోవాలి. మీడియాలో రిపోర్టు చేసినట్లుగా లోపలకు అనుమతించిన వారి మొబైల్ కు ఓటీపీ రావటం.. దాన్నిచెప్పిన వారిని మాత్రమే అనుమతించటం జరిగింది. అంత మాత్రాన.. పబ్ లో డ్రగ్స్ ను వినియోగించేందుకు వీలుగా ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చారన్న భావనతో వార్తలు రాసేయటం తప్పే అవుతుంది. బ్యాడ్ లక్ ఏమంటే.. అలాంటి ‘వంటకాన్ని’ ప్రధాన మీడియా సంస్థల వార్తల్లోనూ కనిపించటం షాకింగ్ గా అనిపించక మానదు.